ఒకేసారి మూడు సినిమాలంటే.. రిస్క్ అనే చెప్పాలి

భీభత్సమైన ప్లానింగ్ ఉన్న దిల్ రాజు నిర్మాతే.. ఒకేసారి రెండుమూడు సినిమాలు ప్రొడ్యూస్ చేసి బొక్కబోర్లా పడ్డాడు. అందుకే ఒకదాని తర్వాత ఒకటి అనే పద్ధతి ప్రకారం సినిమాలు నిర్మిస్తూ తన ఉనికిని కాపాడుకున్నాడు. కానీ.. నితిన్ లాంటి యంగ్ హీరో మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ తన కెరీర్ ను తానే రిస్క్ లో పెట్టుకొంటున్నాడు. ఇదివరకు కూడా ఒకేసారి “లై, చల్ మోహనరంగా. శ్రీనివాస కళ్యాణం” సినిమాలు చేసి హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకొన్నాడు నితిన్. దాదాపు ఏడాది విరామం అనంతరం మళ్ళీ వరుసబెట్టి సినిమాలు చేస్తూ అలాంటి తప్పే రిపీట్ చేస్తున్నాడనిపిస్తోంది.

ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ” అనే సినిమాలో నటిస్తున్నాడు నితిన్. రష్మిక మండన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా మరో సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగిన కొద్ది రోజులకే తన 29వ సినిమాగా “రంగ్ దే” అనే చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు నితిన్. “తొలిప్రేమ, మిస్టర్ మజ్ను” ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించనుంది. ఇలా ఒకేసారి మూడు ప్రొజెక్ట్స్ ఎనౌన్స్ చేయడం అనేది మంచిదే కానీ.. ఆ మూడు సినిమాల చిత్రీకరణలు ఒకేసారి చేయడం మాత్రం సరైంది కాదు. మరి నితిన్ ఈ మూడు సినిమాలను ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus