యూత్ స్టార్ అంత రిస్క్ చేయబోతున్నాడా..!

టాలీవుడ్ హీరోల్లో నితిన్ ను యూత్ స్టార్ అని అందరూ పిలుస్తుంటారు.అతను ఇండస్ట్రీకి వచ్చి 19ఏళ్ళు కావస్తున్నా.. అతని వయసు 37ఏళ్ళు అయినప్పటికీ.. నితిన్ ను ఇంకా యూత్ స్టార్ అనే అంటుంటారు. అతన్ని యూత్ ఫుల్ ఫిలిమ్స్ లో చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కాబట్టి.. అతన్ని అలాగే పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు నితిన్ 60ఏళ్ళ వృద్ధుడి పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడట. వినడానికే షాకింగ్ గా అనిపిస్తుంది కదూ..! కానీ ఇది నిజమే.. నితిన్ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది.

ఈ చిత్రానికి ‘పవర్ పేట’ అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. ఇదిలా ఉండగా.. కథ ప్రకారం ఈ చిత్రంలో నితిన్ 60ఏళ్ళ వృద్దుడిగా కనిపించబోతున్నాడట.ఇటీవల నితిన్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని… అది కూడా బాగా వచ్చిందని సమాచారం. త్వరలోనే నితిన్ ఓల్డేజ్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోగా సత్యదేవ్ కూడా నటిస్తున్నాడు. అతని పాత్ర కూడా ఈ చిత్రంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.

23-Nithiin

నితిన్ సొంత బ్యానర్ అయిన ‘శ్రేష్ట్ మూవీస్’ పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇక నితిన్ తాజా చిత్రమైన ‘చెక్’ ఫిబ్రవరి 19న విడుదల కాబోతుంది. అటు తరువాత మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ‘అందాదున్'(బాలీవుడ్) రీమేక్ లో కూడా నటించబోతున్నాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.