నితిన్ (Nithiin) హీరోగా వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో ‘తమ్ముడు’ (Thammudu) రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. నితిన్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన మూవీ ఇది. ట్రైలర్ తో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ ట్రైలర్ ఆ అంచనాలను పడగొట్టేసింది. తర్వాత జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. దాని ప్రభావం ఓపెనింగ్స్ పై పడింది.
వీకెండ్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ సినిమా.. వీకెండ్ తర్వాత మరింత డౌన్ అయ్యింది. 4 వ రోజు రెండింతలు తగ్గాయి. ఒకసారి (Thammudu) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 0.98 cr |
సీడెడ్ | 0.25 cr |
ఉత్తరాంధ్ర | 0.43 cr |
ఈస్ట్ | 0.11 cr |
వెస్ట్ | 0.06 cr |
గుంటూరు | 0.25 cr |
కృష్ణా | 0.29 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ+తెలంగాణ | 2.43 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.26 cr |
ఓవర్సీస్ | 0.54 cr |
వరల్డ్ టోటల్ | 3.23 cr (షేర్) |
‘తమ్ముడు’ (Thammudu) సినిమాకు రూ.22 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.22.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.3.23 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.39 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం మరో రూ.19.27 కోట్లు షేర్ ను రాబట్టాలి.