2021 కూడా తెలుగు సినిమాలకు శుభారంభాన్నే ఇచ్చిందని చెప్పాలి.కమర్షియల్ గా చూసుకుంటే సంక్రాంతికి విడుదలైన 4 సినిమాల్లో 3 సక్సెస్ సాధించగా.. ఒకటి మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఇక డ్రై సీజన్ గా భావించే ఫిబ్రవరి లో కూడా ‘ఉప్పెన’ వంటి చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ‘జాంబీ రెడ్డి’ ‘నాంది’ వంటి చిత్రాలు కూడా మంచి విజయాలను సాధించాయి. అయితే ఫిబ్రవరిలో రాబోతున్న మరో చిత్రం ‘చెక్’ ఫలితం ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకుల్లో ఉత్కంఠత నెలకొంది.
గతేడాది ఇదే నెలలో ‘భీష్మ’ తో బ్లాక్ బస్టర్ కొట్టి వరుస ప్లాపుల నుండీ బయటపడిన నితిన్.. ఈసారి కూడా హిట్టు కొట్టి అదే ఫామ్ ని కొనసాగిస్తాడా లేక మళ్ళీ ప్లాపుల బాట పడతాడా అనే అనుమానాలు చాలానే వ్యక్తమవుతున్నాయి. అయితే నితిన్ ‘చెక్’ చిత్రానికి కొన్ని అడ్వాంటేజ్ లు కూడా ఉన్నాయి. ఈ చిత్రం దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఏ చిత్రానికి మిశ్రమ స్పందన రాలేదు. కమర్షియల్ గా రిజల్ట్ తేడా కొట్టినవి ఉన్నాయి కానీ మౌత్ టాక్ పరంగా ఆయన సినిమాలకు ఎప్పుడు పాజిటివ్ టాకే వస్తుంటుంది.
పైగా ‘చెక్’ చిత్రం రూ.16కోట్ల షేర్ ను నమోదు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే..! అంతేకాదు ఇప్పుడు 100శాతం సీటింగ్ కెపాసిటీ ఉండడంతో.. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధించి.. హిట్ లిస్ట్ లోకి చేరిపోయే అవకాశం ఉంటుంది. మరి ‘నాంది’ తో ఓ ఖైదీ(అల్లరి నరేష్) హిట్ కొట్టి గట్టెక్కేసాడు. ‘చెక్’ తో ఈ ఖైదీ(నితిన్) కూడా హిట్టు కొట్టి అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడేమో చూడాలి..!
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!