పవన్ టైటిల్ .. పవన్ డైరెక్టర్.. నితిన్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో తమ్ముడు సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే పవన్ కు వీరాభిమాని అయిన నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే టైటిల్ తో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల టైటిల్స్ ను తమ సినిమాలకు ఫిక్స్ చేయడానికి టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలలో ఎక్కువ మంది హీరోలు ఆసక్తి చూపుతున్నారు. విజయ్ దేవరకొండ, సమంత కాంబో మూవీ ఖుషి టైటిల్ తో తెరకెక్కి ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తమ్ముడు టైటిల్ తో నితిన్ మరోసారి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్కాతమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. నితిన్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యపరుస్తున్నారు. నితిన్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నితిన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు నితిన్ రేంజ్ పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం నితిన్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. నితిన్ ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. పవన్, నితిన్ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus