నెట్టింట హల్ చల్ చేస్తున్న నితిన్-షాలినీ ల లేటెస్ట్ ఫోటోలు..!

యూత్ స్టార్ నితిన్ కాస్త ఈ లాక్ డౌన్ టైంలో ఫ్యామిలీ స్టార్ నితిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన షాలిని కందుకూరిని ఈ కరోనా టైంలోనే పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూలై 26న తాజ్ ఫ‌ల‌క్ నుమా హోట‌ల్ లో నితిన్ -షాలిని ల వివాహం జరిగింది. క‌రోనా నియమాలను పాటిస్తూ కొద్ది మంది స‌న్నిహిత‌లు స‌మ‌క్షంలోనే వీరి వివాహం జ‌రిగింది. ఆ టైములో వీరి పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా నితిన్ తన శ్రీమ‌తి బ‌ర్త్‌డే వేడుకను సెల‌బ్రేట్ చేశాడు. క‌మెడీయ‌న్ వెన్నెల కిషోర్ , భీష్మ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములు ఈ వేడుకకి హాజరయ్యి సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ‘భీష్మ’ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్.. ఈ ఏడాది నాలుగు చిత్రాలతో సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

అందులో వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల కాబోతున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇక చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో చేస్తున్న ‘చెక్’, మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘అందాదున్’ రీమేక్, కృష్ణ చైతన్య డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘పవర్ పేట’ వంటి చిత్రాలు ఇదే ఏడాది విడుదల కాబోతున్నాయి. అన్నీ క్రేజీ ప్రాజెక్టులే కాబట్టి.. వాటి పై మంచి అంచనాలే నెలకొన్నాయి.

1

2

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus