Robinhood: క్రిస్మస్ లేదు.. సంక్రాంతి కూడా లేదా..!?
- December 17, 2024 / 02:42 PM ISTByPhani Kumar
నితిన్ (Nithiin) నటించిన ‘రాబిన్ హుడ్'(Robinhood) సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అంటూ ప్రకటించారు. కానీ తర్వాత డిసెంబర్ 25 కి వాయిదా వేశారు. ఇప్పుడైతే ఆ డేట్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి కొత్త కారణాలు ఏమీ చెప్పాల్సిన పనిలేదు. రెండిటికీ నిర్మాతలు ‘మైత్రి’ వారే. కాబట్టి ఒక పెద్ద సినిమాని రిలీజ్ చేసిన కొద్దిరోజులకి మరో మిడ్ రేంజ్ సినిమాను విడుదల చేయడం ఇబ్బందే. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమాని వాళ్ళు భారీ రేంజ్లో ప్రమోట్ చేశారు.
Robinhood

ఇప్పుడు వెంటనే ‘రాబిన్ హుడ్’ ని రిలీజ్ చేయడానికి సరైన పబ్లిసిటీ చేయలేదు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి.. ఓ పాటని రిలీజ్ చేసినా అది జనాల్లోకి వెళ్ళలేదు. టీజర్ కి కూడా అంతంత మాత్రమే రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి టైంలో సడన్ గా డిసెంబర్ 25 కి రిలీజ్ చేస్తే.. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావు. సో ఇప్పుడు నిర్మాతలకి ఉన్న ఆప్షన్ సంక్రాంతి మాత్రమే. అయితే ఆల్రెడీ సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

అందులో రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కి డౌట్ లేకుండా ఎక్కువ థియేటర్లు వెళ్తాయి. తర్వాత బాలకృష్ణ (Nandamuri Balakrishna) ”డాకు మహారాజ్” (Daaku Maharaaj) , వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలకి సరిసమానంగా థియేటర్లు వెళ్తాయి. ఇంకో విషయం ఏంటంటే.. ఆ 3 సినిమాలు దిల్ రాజు (Dil Raju) కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ‘మైత్రి’ వారు ‘రాబిన్ హుడ్’ కి ఎక్కువ థియేటర్లు ఏర్పాటు చేయలేరు. రిపబ్లిక్ డే కి ముందు వస్తే కొంచెం బెటర్. కానీ వారి నిర్ణయాన్ని త్వరగా రివీల్ చేస్తే బెటర్. లేదంటే.. ఆ డేట్స్ కి వేరే సినిమాలు వచ్చి పడితే కష్టమవుతుంది.












