‘చెక్’ తో మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి వరుస డిజాస్టర్లు ఎదుర్కొన్న నితిన్.. ఆ సినిమాల దెబ్బకు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. అటు తరువాత 2020 ఫిబ్రవరిలో ‘భీష్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో విడుదలైనప్పటికీ ఘన విజయం సాధించింది. థియేట్రికల్ పరంగా ‘భీష్మ’ చిత్రం 28కోట్ల షేర్ ను రాబట్టి నితిన్ కు మంచి కంబ్యాక్ ను అందించింది.

దాంతో 2021 ఫిబ్రవరిలో కూడా నితిన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. మరి ఈసారి కూడా హిట్ అందుకుంటాడా… అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అనే డిస్కషన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి. వివరాల్లోకి వెళితే… నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘భవ్య క్రియేషన్స్’ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కాబోతుంది.

జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ‘చెక్’. ‘ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ.. చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది’ మెయిన్ పాయింట్ గా తెలుస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు మంచి స్పందనే లభించింది.రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ వంటి క్రేజీ భామలు నటించిన ఈ చిత్రం కూడా హిట్ అయ్యి.. నితిన్ కు ఫిబ్రవరి నెల కలిసొచ్చేలా చేస్తుందేమో చూడాలి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus