టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈయన చివరిగా మాచర్ల నియోజకవర్గం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేక పోయింది అయితే ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నితిన్ వక్కంతం వంశీ అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాలకు కమిట్ అయ్యారు.
ఇలారెండు సినిమాలకు కమిట్ అయినటువంటి నితిన్ (Nithin) ఈ రెండు సినిమాలు కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అయితే వరుస షూటింగ్స్ తో ఎంతో బిజీగా ఉన్నటువంటి నితిన్ సినిమా షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.
ఇలా షూటింగ్ పనులకు విరామం ప్రకటించినటువంటి నితిన్ తన భార్యతో కలిసి వెడ్డింగ్ యానివర్సరీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన భార్యశాలినితో కలిసి ఈయన బార్సిలోనా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇక శాలిని నితిన్ ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2020 జూలైనెలలో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి అయినప్పటి నుంచి వీరిద్దరూ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇక మూడవ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వీరిద్దరూ వెకేషన్ లో ఉండగా శాలిని మాత్రం ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈమె తన భర్త కౌగిలిలో బందీ అయినటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మూడు సంవత్సరాలు చాలా అందంగా గడిచాయి థాంక్యూ అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు వీరిపై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
.