నిత్య మీనన్ (Nithya Menen) లుక్ విషయంలో ఓ స్పెషాలిటీ ఉంటుంది. అదే ఆమె రింగుల జుట్టు. డిఫరెంట్‌గా కనిపించే ఆ జుట్టుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆ రింగుల జుట్టు గురించి నిత్య మేనన్ ఇటీవల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ జుట్టు విషయంలో తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక ఎదురవుతున్న విషయాల గురించి చెప్పుకొచ్చింది నిత్య మేనన్.
సినిమాల్లోకి వచ్చే ముందు చాలామంది తన రూపాన్ని మార్చుకోమని చాలామంది చెప్పారట. స్కూల్‌లో, కాలేజీల్లో చదువుకునే రోజుల్లో జుట్టుతో ఎప్పుడూ సమస్యగానే ఉండేది అని నిత్య మేనన్ చెప్పింది. ఎందుకా జట్టు అని చాలామంది అనేవారట. అంతేకాదు మొదటి సినిమా చేస్తున్నప్పుడు కొందరు ‘‘ఈ జుట్టు ఏమిటి? వింతగా ఉంది’’ అని అన్నారట. కానీ ఇప్పుడు అదే రింగుల జుట్టునే అందరూ ఇష్టపడుతున్నారు అని చెప్పుకొచ్చింది నిత్య మేనన్.
మీరు పొట్టిగా, లావుగా ఉంటారు.. మీ కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయి లాంటి మాటలు కూడా ఎదుర్కొన్నా అని నాటి రోజులు గుర్తు చేసుకుంది నిత్య మేనన్. ఆ మాటలు చాలా ప్రభావితం చేశాయని, అంతేకాదు ప్రభావితం చేయాలి కూడా అని తన మోటివేషన్ గురించి చెప్పింది. అలాంటప్పుడే సవాళ్లను ఎదుర్కొగలమని కూడా చెప్పింది. ఎన్ని విమర్శలు ఎదురైనా ఎప్పుడూ తన రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించలేదని, నాలా నేను ఉంటూ నిరూపించుకున్నాను.
సినిమాలు చేసి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నాను. అందుకే శారీరక రూపాన్ని బట్టి మనుషుల్ని అంచనా వేయడం సరైన ఆలోచన కాదు అని చెప్పింది నిత్య. నిత్య సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం తమిళ హీరో ధనుష్‌తో (Dhanush) ‘ఇడ్లీ కడై’ (Idly Kadai) అనే సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సినిమాలో కూడా నటిస్తోంది.