Nithya Menen: నిత్యామీనన్ చేసుకోబోయేది ఆ హీరోనేనంట?

మలయాళ బ్యూటీ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచి నటన మీద ఆసక్తి పెంచుకోవడంతో బాలనటిగా మారింది. నిజానికి పుట్టి పెరిగింది కర్ణాటకలో కావడంతో ఆమె తనను మలయాళీ అనడం కంటే కన్నడ రాష్ట్రానికి చెందిన మహిళ అంటేనే ఎక్కువ ఆనందిస్తానని చెబుతూ ఉంటుంది. తొలుత కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత మలయాళ సినిమాలు కూడా చేశారు.

అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన (Nithya Menen) ఆమె ఆ తర్వాత 180, ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతయింది, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రుద్రమదేవి, జనతా గ్యారేజ్, గమనం, నిన్నిలా నిన్నిలా, స్కైలాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో అలరించారు. ప్రస్తుతం ఆమెకు హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో పెళ్లి చేసుకోవడం కోసం సర్వం సిద్ధం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరోని ఆమె వివాహం చేసుకోబోతోంది అంటున్నారు.

ఆయన మరెవరో కాదు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ హీరో అని అంటున్నారు. మలయాళ హీరోతో నిత్యా మీనన్ కు గత కొంత కాలంగా సాన్నిహిత్యం ఏర్పడిందని, త్వరలోనే అతనితో కలిసి ఏడు అడుగులు వెయ్యబోతోంది అంటూ మలయాళ వెబ్సైట్లో కథనాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం మీద వారు అధికారిక ప్రకటన చేస్తే కానీ తెలియదు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus