మహానటుడు నందమూరి తారక రామారావు సినిమా.. రాజకీయరంగంలో సాధించిన విజయాలను వెండితెరపై చూపించడానికి తేజ కష్టపడుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసిన తేజ.. ఆర్టిస్టుల సెలక్షన్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. అప్పుడు ఇందిరా గాంధీకి ఎన్టీఆర్ కి మధ్య చిన్న యుద్ధమే జరిగింది. ఆ గొడవను ఈ సినిమాలో కళ్ళకు కట్టనున్నారు. ఆ ఇందిరాగాంధీ పాత్రకు నదియాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇక ఎన్టీఆర్ భార్య అయిన బసవతారకం పాత్ర కోసం నిత్యామీనన్ ని చిత్ర బృందం సంప్రదించింది. ఈ రోల్ చేయడానికి ఆమె నిరాకరించినట్లు ఫిలిం నగర్ వాసులు తెలిపారు.
నేరుగా ఆ రోల్ చేయడం ఇష్టంలేదని చెబితే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన నిత్యామీనన్ తాను మెగా ఫోన్ అందుకోబోతున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. వాస్తవానికి తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇందులో నటించవచ్చు. కానీ బసవతారకం పాత్రలో ఇంపార్టెన్స్ లేదనే కారణంతోనే ఈ ఛాన్స్ వదులుకుందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. మరి ఏది నిజమో సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతం తేజ వెంకటేష్ తో ఆట నాదే వేటా నాదే అనే సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనుంది.