Nitin Narne: ఒక్క ప్రాజెక్ట్‌… రెండు విషయాల్లో క్లారిటీ.. గీతా ఆర్ట్స్‌ ప్లానింగ్‌ చూశారా?

నితిన్‌ నార్నె.. ఇలా అంటే అందరికీ తెలియకపోవచ్చు. అందుకే క్లారిటీగా ఎన్టీఆర్‌ బావమరిది అని చెప్పుకుందాం. చాలా రోజుల నుండి నితిన్‌ నార్నె గురించి వింటూనే ఉన్నాం. ఆ సినిమా ఓకే చేశాడు, ఈ బ్యానర్‌లో నటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. అయితే ఓ సినిమా మొదలైంది కానీ ఎటూ తేలలేదు. దీంతో కొత్త సినిమా కోసం మళ్లీ ప్లాన్స్‌ జరుగుతున్నాయి అని అంటున్నారు. దీని కోసం స్టార్‌ కిడ్స్‌కి మంచి విజయాలు ఇచ్చే గీతా ఆర్ట్స్‌ రెడీగా ఉంది అని అంటున్నారు. ఈ మేరకు త్వరలో ప్రకటన అని సమాచారం.

అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌కు చాలా అవసరమైన సమయంలో గీతా ఆర్ట్స్‌ సరైన విజయం ఇచ్చి బూస్ట్‌ ఇచ్చింది. ఇక ‘రేయ్‌’ సినిమా చేసి అది విడుదల అవ్వడానికి ఇబ్బందిపడుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ను ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అంటూ మంచి సినిమాను ఇచ్చారు. ఇప్పుడు అదే కోవలో నితిన్‌ నార్నెకు సినిమా చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. తొలి సినిమా సంగతి తర్వాత చూద్దాం ముందు ఈ సినిమా చేద్దాం అని అనుకుంటున్నారట. ఈ మేరకు త్వరలో సినిమా ఓపెనింగ్‌ ఉంటుంది అని సమాచారం.

‘జాతిరత్నాలు’ సినిమా తరువాత పెద్ద నిర్మాణ సంస్థలు చిన్న సినిమాలు టేకప్ చేసి, చకచకా సినిమాలు చేసేశాయి. అయితే వాటిలో చాఆలవరకు బోల్తా కొట్టాయి. దీంతో వాళ్లు మళ్లీ పెద్ద సినిమాలవైపు వస్తున్నారు. అలా గీతా ఆర్ట్స్‌ కూడా చిన్న సినిమాల ఆలోచనలు చేసి తేడా కొట్టేసింది. దీంతో ఇప్పుడు బన్నీ – త్రివిక్రమ్‌, నాగచైతన్య – చందు మొండేటి సినిమాలు చేస్తున్నారు. త్వరలో సూర్య – బోయపాటి శ్రీను సినిమా ఉంటుంది అంటున్నారు.

అయితే మిగతావాళ్లలా చిన్న సినిమాలు వదిలేయాలని గీతా ఆర్ట్స్‌ అనుకోవడం లేదు. ఈ క్రమంలో నితిన్ సినిమా కూడా చేస్తారట. నితిన్‌ సినిమాకు అంజి అనే నూతన దర్శకుడు పని చేయబోతున్నారట. కథ విషయంలో అల్లు అరవింద్‌ పక్కా అనుకుని ముందుకు వెళ్తున్నారట. మరి నితిన్‌ (Nitin Narne) తొలి సినిమా ఏదవుతుందో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus