వైరల్ అవుతున్న నిత్య మేనన్‌ కొత్త లుక్..!

‘అలా మొదలైంది’ టాలీవుడ్ కి పరిచయమయ్యింది నిత్య మేనన్‌. మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. చూడటానికి కొంచెం బొద్దుగా ఉండటం వలన ఈ భామకి పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. అందులోనూ పెద్దగా గ్లామర్ షో కి కూడా పెద్దగా ఆసక్తి చూడకపోవడం వంటి అంశాలతో పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. చేసింది కొన్ని చిత్రాలే .. అయినా నటనలో మాత్రం నిత్య మేనన్‌ తన మార్క్‌ను చూపిస్తూనే ఉంది. ఆ మధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ.. ఇప్పుడు స్పీడు పెంచినట్టే కనిపిస్తుంది.

గతంలో నిత్యామీనన్‌ లావుగా ఉండడంతో .. సినిమా అవకాశాలు తగ్గాయని రూమర్స్‌ వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే మాట నిత్య మేనన్‌ ను అడిగితే.. నేను ఎలా ఉంటే మీకేంటి..నటన ముఖ్యం కదా అంటూ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే… ఇప్పుడు మాత్రం నిత్య మేనన్‌ పూర్తిగా జీరో సైజ్‌లోకి మారినట్టు స్పష్టమవుతుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఓ చిత్రం కోసమే నిత్య మేనన్‌ బరువు తగ్గిందని సమాచారం. ‘హైవే పై షూట్‌.. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన త్వరలో చెబుతాను’ అంటూ తాజాగా నిత్య మేనన్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నిత్య మేనన్‌ ఇలా సన్నపడడంతో ఇక వరుస ఆఫర్లు క్యూలు కట్టడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నిత్య మేనన్‌ ప్రస్తుతం ‘ప్రాణ’ ‘ఐరన్‌ లేడీ’ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ సరసన ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంతో కూడా బిజీగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus