Nivetha Pethuraj: తన కెరీర్ గురించి నివేదా పేతురాజ్ షాకింగ్ కామెంట్స్..!

‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’,’అల వైకుంఠపురములో’ ‘రెడ్’, ‘పాగల్’ ‘బ్లడీ మేరీ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమాల్లో ఆమె ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేసినవి తక్కువ. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక ‘బ్లడీ మేరీ’ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. ఈ కారణాల వలన నివేదా టాలెంట్ ఫుల్ గా బయటపడలేదు.

త్వరలో ‘విరాట పర్వం’ తో కూడా ప్రేక్షకులను పలకరించబోతుంది నివేదా పేతురాజ్. అయితే ఈ మూవీలో కూడా నివేదా చేసింది అతిథి పాత్ర లాంటిది మెయిన్ హీరోయిన్ గా . కాబట్టి ఈ మూవీ కూడా ఆమెకు కలిసొచ్చేది ఏమీ ఉండదు. ఇలాంటి టైంలో ఆమె కెరీర్ కు సరైన బ్రేక్ ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో నివేదా తన కెరీర్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ.. ” నేను అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చాను. హీరోయిన్‌ గా కంటే కూడా నేను నటి అనిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. చాలా మంది హీరోయిన్స్ గా సినిమాలు చేయకపోతే కెరీర్‌ ఉండదేమో అని భయపడుతూ ఉంటారు.కానీ నాకు అలాంటి భయం ఏమీ లేదు. నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. సినిమాలో నా పాత్రకి ప్రాముఖ్యత ఉండి లెంగ్త్ చిన్నగా ఉన్నా నేను ఓకె చెప్తాను.

ఒకవేళ అలాంటి అవకాశాలు రాకుంటే ఉద్యోగం అయినా చేసుకుంటాను. సినిమాల్లోకి రాకముందు నేను బొటిక్‌ నిర్వహించేదాన్ని. పలు ఈవెంట్లు, కార్ల కంపెనీల్లో కూడా పని చేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus