హీరోయిన్ నివేథా పేతురాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెంటల్ మది’లో అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేథా.. వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తుంది. వాస్తవానికి మెంటల్ మదిలో చిత్రం తర్వాత నివేథా కి తెలుగులో అవకాశం రాలేదు. దీంతో ఆమె తమిళ్ ఇండస్ట్రీ పైన ఫోకస్ పెట్టింది. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా కొన్నేళ్లు గడిపింది.
అయితే ఇటీవలే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంలో నివేథా పేతురాజ్ సెకండ్ హీరోయిన్ గా నటించి.. అందరి దృష్టిని ఆకర్షించింది.ఆ తర్వాత బ్రోచేవారేవరురా లో కూడా సందడి చేసింది. అనంతరం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో నటించి నివేథా పేతురాజ్ పాపులర్ అయింది. ఇటీవలే మాస్ కా దాస్ విశ్వక్సేన్ పాగల్ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నివేథా పేతురాజ్ నటించింది.

కెరియర్ మొదటినుంచి వైవిధ్యమైన కథలను పాత్రను ఎంచుకుని ప్రేక్షకుల మనసును దోచుకుంది బ్యూటీ నివేథా పేతురాజ్..నిజానికి నివేథా పేతురాజ్ అందానికి నటనకి సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి… ఒక స్టార్ హీరోయిన్ కి తీసిపోని అందం స్ట్రక్చర్ ఉన్న నివేథాకి కాలం కలిసి రాక.. గుర్తింపు కరువైపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళలో కూడా పలు చిత్రాలు చేస్తుంది. బ్లడీమేరీ సినిమాతో ఫస్ట్ టైమ్ ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకున్నది నివేథా పేతురాజ్.
గత ఏడాది ఆహా ఓటీటీలో ఈ సినిమా రిలీజైంది. నటనతో పాటు కార్ రేసింగ్‌లోనూ నివేథాకు ప్రావీణ్యముంది. గతంలో ఎఫ్1 కార్‌ను నివేథా నడిపిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా మల్టీకలర్ డ్రస్ లో కొంటె చూపులతో కుర్రకారును కవ్విస్తున్న ఫోటోలను ఆమె ఫాలోవర్స్ తో పంచుకుంది. దీంతో ఆ కిల్లింగ్ లుక్స్ కి సోషల్ మీడియా హిట్ ఎక్కింది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…:
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?
