Nivetha Pethuraj: క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన నివేతా!

‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్. ఆ తరువాత మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్రలహరి’ సినిమాలో కనిపించింది. ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఆమెకి మరో మెగా హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ కనిపించబోతుంది. అలానే సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ఉందట. ఆ అవకాశం నివేతాకు దక్కినట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపించబోతున్నారు. రవితేజకి హీరోయిన్ గా నివేతాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాబీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కథను సిద్ధం చేశాడు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో సెట్ వేసి ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగ్ ను నిర్వహించారు. సెట్స్ లో చిరు, బాబీల ఫొటో కూడా బయటకొచ్చింది. ఈ సినిమాతో పాటు చిరంజీవి చాలా సినిమాలను లైన్ లో పెట్టారు. వచ్చే నెలలో ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదల కానుంది.

అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ సినిమా ‘లూసిఫర్’ను ‘గాడ్ ఫాదర్’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తవ్వకుండానే వెంకీ కుడుములతో మరో సినిమా ఒప్పుకున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus