వకీల్ సాబ్ ఈమె తలరాత మారుస్తుందా..?

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ లో నటించి నటిగా గుర్తింపును సంపాదించుకున్నారు నివేదా థామస్. నివేదా తెలుగులో నటించిన జెంటిల్ మేన్, నిన్నుకోరి, జై లవకుశ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. తెలుగులో సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ అయినప్పటికీ నివేదా మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో నివేదా థామస్ కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. పవన్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా తరువాతైనా వరుస ఆఫర్లతో బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది. అయితే నివేదా థామస్ కు ఆఫర్లు రాకపోవడానికి మరో కారణం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గ్లామర్ రోల్స్ కు నివేదా థామస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే దర్శకనిర్మాతలు ఈమెతో సినిమాలు తెరకెక్కించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు మేకర్స్ దృష్టిని బాగానే ఆకర్షించిన నివేదా తలరాతను వకీల్ సాబ్ మారుస్తుందేమో చూడాల్సి ఉంది.

పింక్ సినిమాలో తాప్సీ నటించిన పాత్రనే వకీల్ సాబ్ సినిమాలో నివేదా పోషిస్తున్నారు. సినిమాలో పవన్ తర్వాత ఆ స్థాయి పాత్ర నివేదాదే అని చెప్పాలి. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ నెల 9వ తేదీన విడుదల కానుంది. నివేదా కెరీర్ కు వకీల్ సాబ్ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది. గ్లామర్ పాత్రలు చేయకపోవడం వల్ల ఇతర ఇండస్ట్రీల నుంచి నివేదాకు తక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి. వకీల్ సాబ్ లోని పాత్ర నివేదాకు మంచి పేరు తెస్తుందో లేదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus