Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » “వకీల్ సాబ్” చిత్రంలో భాగమవడం గర్వంగా ఉంది – హీరోయిన్ నివేదా థామస్

“వకీల్ సాబ్” చిత్రంలో భాగమవడం గర్వంగా ఉంది – హీరోయిన్ నివేదా థామస్

  • April 12, 2021 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“వకీల్ సాబ్” చిత్రంలో భాగమవడం గర్వంగా ఉంది – హీరోయిన్ నివేదా థామస్

తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాయిక నివేదా థామస్. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ “వకీల్ సాబ్” చిత్రంలో కీలక పాత్రలో నటించింది నివేదా. ఈ సినిమా సాధిస్తున్న విజయం పట్ల తన సంతోషాన్ని తెలిపింది నివేదా. ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమవడం గర్వంగా ఉందని చెప్పింది. “వకీల్ సాబ్”
సినిమాలో నటించిన తన అనుభవాలను ఇంటర్వ్యూ ద్వారా నివేదా వివరించింది. ఆమె చెప్పిన విశేషాలు చూస్తే…

– వకీల్ సాబ్ సినిమాకు ప్రేక్షకులు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. మనం సినిమాలను సినిమాగా చూస్తుంటాం. కానీ కొన్ని చిత్రాలను మాత్రమే ఇవి మన కోసం చేసిన సినిమాలు అనిపిస్తాయి. వకీల్ సాబ్ చిత్రాన్ని ఆడియెన్స్ అలా ప్రత్యేకంగా ఫీలవుతున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం, సినిమాకు వస్తున్న వసూళ్లు చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇవే కాదు అనేక కారణాలతో వకీల్ సాబ్ సినిమా నాకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. పింక్ లాంటి సినిమాను తెలుగులో చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా రూపొందించాలని ఆలోచించాం. మా ప్రయత్నం ఇవాళ ప్రేక్షకుల ఆదరణ పొందుతుండటం సంతృప్తిగా ఉంది.

– కరెక్ట్ గా ప్రమోషన్ టైమ్ లో నాకు కొవిడ్ రావడం కొంత బాధగా అనిపించింది. అయితే రైట్ టైమ్ కు నాకు మళ్లీ నెగిటివ్ వచ్చింది. థియేటర్ కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నాను. ఎప్పటిలా ఆరోగ్యంగా కావాలంటే బయట తిరగకుండా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆగిపోయాను. నాకు మాత్రం ఒక్కసారి బయటకు వెళ్లి థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలని ఉంది.

– ఈ సినిమాలో నా క్యారెక్టర్ తో పాటు మిగతా ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్ల గురించి పూర్తిగా తెలుసు. కానీ మొత్తం సినిమా ఎలా చేస్తున్నారు అనే విషయం తెలియదు. మా దర్శకుడి శ్రీరామ్ వేణు మీద నాకు చాలా నమ్మకం ఉంది. పవర్ స్టార్ అభిమానులకు తగినట్లు మార్పులు చేస్తూనే పింక్ కథలోని సోల్ ను ఏమాత్రం పక్కకు పెట్టకుండా బాగా బ్యాలెన్స్ చేస్తూ వకీల్ సాబ్ ను తెరకెక్కించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒరిజినల్ కథలోని సోల్ బాగా బ్యాలెన్స్ అయ్యింది. అది అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతోంది.

– ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. చిత్రీకరణ చేస్తున్నంత సేపు మాత్రమే ఆ పాత్రను మనసులో ఉంచుకున్నాను. స్విచ్ఛాన్ ఆఫ్ టైప్ లో ఈ పాత్రను తీసుకున్నాను. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవాళ సమాజంలో వాస్తవ ఘటనలకు చాలా దగ్గరగా ఉంటుందీ సినిమా. నేను కూడా కొన్ని సార్లు ఇబ్బందికర సందర్భాలు ఎదుర్కొన్నాను. కాబట్టి ఈ పాత్ర గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మనసు పాడు చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ పాత్రను పర్సనల్ గా తీసుకోలేదు.

– పింక్ నాకు మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్. రెండు సార్లు చూశాను. అయితే వకీల్ సాబ్ సినిమా సైన్ చేశాక పింక్ చూడలేదు. పింక్ సినిమా రీమేక్ అయినా వకీల్ సాబ్ చిత్రంలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అందులో కొన్ని సీన్స్ ఇందులో లేవు. ఇంకొన్ని కొత్తగా యాడ్ చేశారు. ఏదేమైనా పింక్ లోని ప్రాథమిక కథ అలాగే ఉంచాం.

– వకీల్ సాబ్ లాంటి చిత్రంలో నటిస్తున్నప్పుడు నటిగా నేను ఎక్కువ స్వేచ్ఛ తీసుకోవడానికి లేదు. ఆ క్యారెక్టర్ పరిమితి ఎంత ఉందో అందులోనే జాగ్రత్తగా నటించాలి. ఇందుకు దర్శకుడు శ్రీరామ్ వేణు మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాను. ఆయన సినిమాలో నా క్యారెక్టర్ ఎలా చూపించాలని అనుకుంటున్నారో పూర్తిగా తెలుసుకుని నటించాను. మనం ఎలా నటిస్తే, క్యారెక్టర్స్ తో ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు అనే విషయాన్ని నేను, అనన్య, అంజలి ముందే చర్చించుకున్నాం. అనన్య, అంజలితో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా ఉండేది. ఒక్క రోజులోనే ఒకరికొకరు బాగా కలిసిపోయాం.

– ఈ సినిమాకు థమన్ ఇచ్చిన ఔట్ పుట్ మరే సంగీత దర్శకుడూ ఇవ్వలేరని నా అభిప్రాయం. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా కంటే పవర్ స్టార్ అభిమానిగా పనిచేశాడు. పాటలకు అనేక వెర్షన్స్ తనకు తానుగా ఇచ్చేవారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మగువా మగువా పాట సినిమా రిలీజ్ కు ముందే చాలా పెద్ద హిట్ అవడం మా అదృష్టం. ఆ పాట సినిమా ప్రారంభంలోనే రావడం వల్ల మా క్యారెక్టర్స్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. దర్శకుడు శ్రీరామ్ వేణు గారు మగువా మగువా పాట విషయంలో చాలా పట్టుదలగా ఉండేవారు. ఈ పాటతోనే మా ముగ్గురి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఏంటి, ఈ అమ్మాయిల లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ల కుటుంబ నేపథ్యాలు ఏంటి..ఇలా చాలా విషయాలను ఈ పాట ద్వారా చెప్పారు. ఈ పాట సాడ్ వెర్షన్ సినిమా చివరలో వస్తున్నప్పుడు ఈ అమ్మాయిలు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ సంపాదించి కుటుంబాలకు పంపిస్తుంటారు. అలాంటి విషయాలన్నీ ఈ పాటలో మరోసారి ఆడియెన్స్ హాంట్ చేశాయి. ఈ పాట ద్వారా మా ఫర్మార్మెన్స్ లు కూడా బాగా ఎలివేట్ అయ్యాయి. వకీల్ సాబ్ విజయంలో థమన్ కు చాలా క్రెడిట్ ఇవ్వాలి.

– సినిమాలు చూసి రాత్రికి రాత్రి ఎవరూ మారిపోరు. వాళ్ల స్వభావాలు సినిమా చూసి మారవు. కానీ ఒక ఆలోచన మాత్రం ఎక్కడో మొదలవుతుంది. ఇవాళ వకీల్ సాబ్ సినిమా చూసిన వాళ్లలో ఒక చర్చ స్టార్ట్ అయ్యింది. మహిళల గురించి మనకు నచ్చిన ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదని, వారిని మనకు తోచిన ఉద్దేశంతో చూడటం సరికాదనే ఆలోచనలు మొదలయ్యాయి. వాళ్ల గురించి మనం జడ్జ్ మెంట్ పాస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్లు చెప్పేది మీకు నచ్చకున్నా, కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వాలనేది ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.

– నేను డైరెక్ట్ గా ఆడియెన్స్ తో ఇంటరాక్ట్ అవకున్నా, సోషల్ మీడియా ద్వారా వకీల్ సాబ్ చిత్రానికి, నా ఫర్మార్మెన్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తున్నాను. చాలా మంది అప్రిషియేట్ చేస్తూ మెసేజ్ లు, వీడియోలు పంపిస్తున్నారు. వాటిలో ఏ ఒక్కటీ వదలకుండా చూస్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే వీలైనంత త్వరలో ఆడియెన్స్ ను నేరుగా కలవాలని అనిపిస్తోంది.

– పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఒక స్పెషల్ ఎక్సీపిరియన్స్. సెట్ లో మా మధ్య ఎప్పుడూ సినిమా గురించి క్యారెక్టర్స్ గురించి సీన్స్ గురించి చర్చ జరుగుతుండేది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ సందర్భంగా ఎలా టైమింగ్ లో చేయాలి అనేది మాట్లాడుకునే వాళ్లం. ఆయన చాలా నైస్ పర్సన్. థాట్ ఫుల్ గా, కామ్ గా ఉండేవారు. భాష మీద పవన్ గారికి ఉన్న పట్టు ఆశ్చర్యాన్ని కలిగించేది.

– సినిమాను ప్రేమించే నిర్మాత దిల్ రాజు గారు. పవన్ సార్ ఫ్యాన్ గా రాజు గారు ఈ సినిమా చేశారు. ఆయన డ్రీమ్ ఫిల్మ్ ఇంత పెద్ద సక్సెస్ అవడం నాకు సంతోషంగా ఉంది. దిల్ రాజు గారి బ్యానర్ లో నటించడం కూడా గౌరవంగా భావిస్తుంటాను. ఈ సినిమా టైమ్ లో ఆయన్ను ఒక అభిమానిగా, ఒక సినిమా లవర్ గా చూశాను.

– పవర్ స్టార్ ఫ్యాన్స్ దేని కోసం ఎదురుచూశారో అలాంటి అంశాల్ని చేర్చుతూ పింక్ కథను పక్కన పెట్టకుండా సినిమా చేయడం అంటే సాధారణ విషయం కాదు. దర్శకుడు శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ ను ప్రెజెంట్ చేసిన విధానం మరే దర్శకుడికీ సాధ్యం కాదేమో. సినిమా సక్సెస్ లో వేణు గారికి మేజర్ క్రెడిట్ వెళ్తుంది.

– కొవిడ్ నార్మ్స్ పాటిస్తూ వకీల్ సాబ్ సినిమాను థియేటర్లో చూడండి. మాస్క్, శానిటైజ్, సోషల్ డిస్టెన్స్ పాటించండని కోరుతున్నాను.

– ప్రస్తుతం మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాను. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సుధీర్ వర్మ డైరెక్టర్. నేను రెజీనా కీ రోల్స్ చేస్తున్నాం.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #Nivetha Thomas

Also Read

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

related news

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

‘గ్లొబ్ ట్రోట్టర్- టాపిక్’ సాంగ్ రివ్యూ..  ‘SSMB29’ టీం ఇలా షాకిచ్చిందేంటి?

‘గ్లొబ్ ట్రోట్టర్- టాపిక్’ సాంగ్ రివ్యూ.. ‘SSMB29’ టీం ఇలా షాకిచ్చిందేంటి?

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

trending news

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

17 hours ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

1 day ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

2 days ago
Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

2 days ago

latest news

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

1 hour ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

17 hours ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

17 hours ago
PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

17 hours ago
VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version