సంచలన ప్రకటన చేసిన నివేదా థామస్..!

ఇప్పటి వరకూ కొంతమంది హీరోలు అలాగే కమెడియన్లు డైరెక్టర్లుగా మారి సినిమాలను తెరకెక్కించిన సందర్భాలను మనం చాలా చూశాం. తెర పై కనిపించే నటులు సినిమాలను డైరెక్ట్ చెయ్యడం కాస్త కొత్త విషయమే కదా..! రామారావు, కృష్ణ, అడివి శేష్, రాహుల్ రవీంద్రన్.. వంటి హీరోలు తమ సినిమాలను డైరెక్ట్ చేసుకున్నారు. ఇక ఎం.ఎస్.నారాయణ, ఏ.వి.ఎస్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి వంటి కమెడియన్లు కూడా డైరెక్టర్లు గా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

మరి ఈ లిస్ట్ లో హీరోయిన్లు లేరా అంటే ఉన్నారు? విజయ నిర్మల గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. జీవిత కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. సావిత్రి గారు కూడా డైరెక్షన్ చేశారు. ఇప్పుడున్న హీరోయిన్లు డైరెక్షన్ వైపుకు అడుగులు వేసే ఆలోచనలో అయితే లేరు. వారి ఇమేజ్ కు తగినట్టు కొన్నాళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోవాలి అనే చూస్తున్నారు. అయితే మన నివేదా థామస్ మాత్రం డైరెక్టర్ గా మారతాను అంటుంది.

‘జెంటిల్ మెన్’ ‘నిన్ను కోరి’ ‘బ్రోచేవారెవరురా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నివేదా థామస్ కు డైరెక్షన్ చెయ్యాలని కోరికట. అయితే ఇప్పుడే కాదంట..! ‘డైరెక్షన్ అనేది నా క‌ల‌. ఎప్ప‌టికైనా డైరెక్టర్ అవుతాను. ప్రస్తుతం డైరెక్షన్ కు సంబంధించి బేసిక్స్ నేర్చుకుంటున్నాను. అయితే మ‌రో రెండు, మూడేళ్ల పాటు నటిగానే కొనసాగుతాను‌. ఆ త‌ర‌వాతే డైరెక్టర్ గా మారడానికి ట్రై చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది నివేదా.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus