Sivakarthikeyan: శివ కార్తికేయన్.. ‘మహావీరుడు’ ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదే…!

శివకార్తికేయన్.. ‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి సినిమాలతో తెలుగులో కూడా హిట్లు కొట్టి ఓ మోస్తరు మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. ఆ తర్వాత ‘ప్రిన్స్’ అనే స్ట్రైట్ మూవీ చేశాడు. అది పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ముందు రెండు సినిమాల కంటే కూడా బెటర్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. సో శివ కార్తికేయన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. అందుకే అతను నటించిన లేటెస్ట్ మూవీ ‘మహావీరుడు’ ని కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

టాలీవుడ్ నటుడు, కమెడియన్, విలన్ అయిన సునీల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ వీక్ ‘బేబీ’ తప్ప పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. కాబట్టి ‘మహావీరుడు’ చిత్రాన్ని ప్రమోషన్స్ తో కొంచెం పుష్ చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. టాక్ కనుక బాగుంటే వీకెండ్ బాగా కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కానీ ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. జూలై 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప.. ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ ప్రమోషన్స్ జరగలేదు.. జరగడం లేదు. కంటెంట్ బాగుంటే ప్రమోషన్స్ తో పెద్దగా పనుండదు. కానీ యావరేజ్ టాక్ కనుక వస్తే ప్రమోషన్స్ వల్ల నిలబడ్డ సినిమాలు చాలా ఉన్నాయి. శివ కార్తికేయన్ (Sivakarthikeyan) తెలుగులో మార్కెట్ పెంచుకునే ఛాన్స్ ఉన్నా.. ఎందుకో ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మరి ‘మహావీరుడు’ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus