మరో రెండు రోజుల్లో భీమ్లా నాయక్ పండుగ మొదలు కానుంది. పవన్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ గడియ ఎంతో దూరంలో లేదు. చాలా కాలం తర్వాత థియేటర్ల వద్ద టికెట్ కౌంటర్లు కళకళలాడబోతున్నాయి. బుక్ మై షోలో అయితే పెట్టిన టికెట్లు పెట్టినట్టు అయిపోతున్నాయి. నైజాంలో బెనిఫిట్ షోలు కూడా ఉన్నాయి. ఉదయం 4 గంటల నుండే ‘భీమ్లా నాయక్’ షోలు పడిపోతాయి. ఆంధ్రాలో అయితే బెనిఫిట్ షోలకి అనుమతులు లభించలేదు.
టికెట్ హైక్ లకు సంబంధించిన జీవో కూడా మార్చి నెలలోనే రానుంది. విడుదలకి రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ ‘భీమ్లా నాయక్’ అప్డేట్ల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘భీమ్లా నాయక్’ లో ఎక్కువ మార్పులు జరగలేదట. ఇది మలయాళం సూపర్ ‘అయ్యప్పనమ్ కోషియమ్’ కు రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదని నిర్మాత ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.
కానీ ఇన్సైడ్ టాక్ వేరేలా ఉంది. ‘భీమ్లా నాయక్’ కు నిర్మాత చెప్పినన్ని మార్పులు అయితే జరగలేదట. తెలుగు నేటివిటీకి ముఖ్యంగా పవన్ అభిమానుల కోసం కొన్ని ఎలివేషన్లని పెంచారు తప్ప.. చాలా వరకు సేమ్ అనిస్తుందని సమాచారం. అహానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన సంఘర్షణే ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మెయిన్ థీమ్. రీమేక్ కూడా అదే థీమ్ తో ఉండబోతుందట. పవన్ మేనరిజమ్స్ మాత్రం ఒరిజినల్ కూడా బిన్నంగా ఉంటాయని తెలుస్తుంది.