పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాని డిసెంబర్ 5కి రిలీజ్ చేస్తామని టీం ప్రకటించింది. వాస్తవానికి ఏప్రిల్ 10నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో వాయిదా వేశారు. అదే సమయంలో టీజర్ కూడా లాంచ్ చేశారు. టీజర్ అందరినీ ఆకట్టుకుంది.
అప్పటివరకు ఉన్న నెగిటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టింది. అందులోని విజువల్స్ అన్నీ టాప్ నాచ్ లో ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానా ఇది? అనేలా అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రస్తుతం కొంత భాగం షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగే పాటల చిత్రీకరణ కూడా బ్యాలెన్స్ ఉంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా డిసెంబర్ రేసు నుండి కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టాక్ నడిచింది. 2026 సంక్రాంతి కానుకగా ‘ది రాజాసాబ్’ ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడిచింది. ఎందుకంటే బాలకృష్ణ ‘అఖండ 2’ డిసెంబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని కాబట్టి.. 2026 జనవరి 9న ‘ది రాజాసాబ్’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ ఇందులో నిజం లేదు అని స్పష్టమవుతుంది. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో అతని లుక్ కు సంబంధించిన పోస్టర్ తో బర్త్ డే విషెస్ చెప్పింది చిత్ర బృందం. అలాగే ఇందులో రిలీజ్ డేట్ డిసెంబర్ 5 అని ఉంది. సో రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి మార్పు లేదని టీం చెప్పినట్టు అయ్యింది.