Saiyaara: చిన్న ప్రేమకథా సినిమా.. పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్

కొన్ని నెలలుగా చూసుకుంటే బాక్సాఫీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. థియేటర్ల పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. జనాలు థియేటర్లకు రావడం లేదు అని డిస్ట్రిబ్యూటర్లు లైవ్లోకి వచ్చి గోల పెడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. నార్త్ గురించి చెప్పనవసరం లేదు. హిందీలో చాలా కాలంగా బాక్సాఫీస్ డల్ గానే కొనసాగుతుంది. సౌత్ సినిమాలు మాత్రమే అక్కడి బాక్సాఫీస్ ను సేవ్ చేస్తున్న పరిస్థితి.

Saiyaara

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఓ మిడ్ రేంజ్ సినిమా పాన్ ఇండియా సినిమాల స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. అది మరేదో కాదు ‘సైయారా’. ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ బ్యానర్ వారు నిర్మించిన ఈ చిత్రానికి ‘ఆషికి 2’ ఫేమ్ మోహిత్ సూరి దర్శకుడు.విజయ్ దేవరకొండ ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే సోదరుడు అయినటువంటి ఆహాన్ పాండే హీరోగా నటించిన ఈ సినిమాలో ‘సలాం వెంకీ’ ఫేమ్ అనీత్ పడ్డా హీరోయిన్ గా నటించింది. జూలై 18న లో బజ్ తోనే సినిమా రిలీజ్ అయ్యింది.

కానీ పాటలు హిట్ అవ్వడంతో సినిమాకి మంచి పబ్లిసిటీ దక్కినట్టు అయ్యింది. కథైతే సాదా సీదా కథే. హీరోయిన్ ముందుగా ఒకరిని ప్రేమిస్తుంది. తర్వాత అతనితో విడిపోతుంది. అటు తర్వాత హీరోకి కనెక్ట్ అవుతుంది. చివరికి వీళ్ళు ఎలా కలిశారు. అంతే..! కానీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పాటలకి రీ-కాల్ వాల్యూ ఉండటం.. సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే ఎంత హిట్ అయినా దీని ప్రయాణం రూ.100 కోట్లు, రూ.150 కోట్లు వద్ద ఆగిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా రూ.400 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసింది. ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నిర్మాతలే ఈ సినిమాని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళకు ఆల్రెడీ 10 రెట్లు లాభాలు వచ్చాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus