Vyuham: అంత కాంట్రోవర్సీ చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు!

ఎన్నికల టైంలో పొలిటికల్ థీమ్ తో రూపొందిన సినిమాలు రావడం సహజం. అయితే వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. డైరెక్ట్ టార్గెటింగ్ ఉండకూడదు. ఫిక్షన్ జోడించాలి. తప్పులు చూపించినా పర్వాలేదు, విమర్శలకు చాలా దూరంగా ఉండాలి. ఇవన్నీ పాటించే అలాంటి సినిమాలు చేయాలి. ఒకవేళ ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. సినిమా విడుదల కావడం కష్టం. ఈ మధ్య పొలిటికల్ సినిమాలు వచ్చాయి. ‘యాత్ర 2 ‘ ‘రాజధాని ఫైల్స్’ వంటి సినిమాలు అవి.

ఇలాంటి సినిమాలకి ముందుగా ఉండేది రాంగోపాల్ వర్మ. తాను కూడా ఏపీ అధికారిక పార్టీకి అనుకూలంగా ‘వ్యూహం’ అనే సినిమా చేశాడు. అతని ఉద్దేశం.. అక్కడి ముఖ్యమంత్రి జగన్ ను హైలెట్ చేయాలి. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కమెడియన్స్ గా చూపించాలి. ఇదే అతని టార్గెట్. అయితే ఇది కొత్త వ్యవహారం కాదు. ఇంతకు ముందే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ‘పవర్ స్టార్’ వంటి సినిమాలు చేశాడు.

ఇప్పుడు వ్యూహం (Vyuham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం అతను ప్రెస్ మీట్లు పెట్టి చాలా వివాదాలకు తెరలేపాడు. అయినా జనాలు ఈ సినిమా పై ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఫిబ్రవరి 23 నే రిలీజ్ అవుతుంది.ఇదే డేట్ కి దీంతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి థియేటర్స్ దొరకలేదు. దొరికిన థియేటర్స్ లో కూడా మినిమమ్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ లేవు.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus