సెల్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చాక ఎలా అయితే.. ఫస్ట్ డే సినిమా మజా మిస్ అవుతున్నామో.. ఈ కలెక్షన్స్ గోల మొదలయ్యాక సినిమా సక్సెస్ మజాను కూడా అలానే మిస్ అవుతున్నాం. మా హీరో సినిమా ఇంత వసూలు చేసింది, మా హీరో సినిమా ఫస్ట్ డే/ఫస్ట్ వీక్/ఫస్ట్ మంత్ కలెక్షన్స్ ఇంత అని అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా కొట్టుకోవడమే సరిపోతుంది. అభిమానులు సరిపోరన్నట్లు నిర్మాతలు, పీయార్వోలు కూడా ఈ ఫ్యాన్ వార్ లో తమకు తెలియకుండానే పాలుపంచుకొని ఆజ్యం పోయడం మొదలెట్టారు.
ఈ ఏడాది సంక్రాంతికి “సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో” సినిమా బృందాల నడుమ సాగిన అనవసర పోరే అందుకు నిదర్శనం. అయితే.. ఈ కరోనా పాపమో, పుణ్యమో తెలియదు కానీ ఇంకో ఏడాదిపాటు ఈ కలెక్షన్స్, ఫస్ట్ డే హయ్యస్ట్ అనే సోది ఉండదు. పెద్ద స్టార్లు కూడా ఒటీటీ చెంతకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళ భారీ చిత్రం “మాస్టర్”ను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే విడుదల చేస్తామని చెబుతున్నప్పటికీ..
రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు మరియు పరిస్థితులు అందుకు సహకరించేలా కనిపించడం లేదు. సో, ఈ పరిస్థితులన్నా పనికిమాలిన ఫ్యాన్ వార్స్ కు అడ్డుకట్టవేస్తుందేమో లేదో చూడాలి. హీరోలు కూడా తమ రెమ్యూనరేషన్స్ ను తగ్గించుకొని కాంబినేషన్ కాక కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి ఈ పరిస్థితి తోడ్పడింది.
Most Recommended Video
15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!