హాళ్లు తెరుచుకున్నా.. సినిమాలు లేవు!

  • October 15, 2020 / 04:19 PM IST

ఈరోజు నుండి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లలో సందడి మొదలవుతుందని ఆశించారు. కానీ అలా జరగడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ లను తెరవడం లేదు. కేవలం మల్టీప్లెక్స్ లు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ రిలీజ్ కి సినిమాలు మాత్రం లేవు. దీంతో ఇదివరకే రిలీజైన సినిమాలను మరోసారి ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. బెంగుళూరు, చెన్నై లాంటి సిటీలలో తమ భాషకి సంబంధించిన సినిమాలతో పాటు తెలుగులో హిట్ అయిన ‘అల.. వైకుంఠపురములో’, ‘భీష్మ’ లాంటి సినిమాలను ప్రదర్శిస్తున్నారు.

దీనికి సంబంధించి బుక్ మై షో యాప్ లో టికెట్ల బుకింగ్ కూడా జరుగుతోంది. నార్త్ లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఇప్పటికే విడుదలైన ‘తప్పడ్’, ‘మలంగ్’ లాంటి సినిమాలను థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ థియేటర్ సంస్థ పీవీఆర్ ఈరోజు నుండి థియేటర్లు ఓపెన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. తమకున్న స్క్రీన్లలో అరవై శాతం థియేటర్లను రన్ చేయడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. పీవీఆర్ తో పాటు మరికొన్ని మల్టీప్లెక్స్ లు కూడా ఓపెన్ అవుతున్నాయి.

అయితే ఏపీ, తెలంగాణాలో మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది. తెలంగాణాలో థియేటర్లు తెరవడానికి ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో అనుమతులు రాకపోవడం, భారీ వర్షాల కారణంగా థియేటర్లు తెరవడానికి ఇబ్బందిగా మారింది. ఇక ఏపీలో అయితే హాళ్లు ఓపెన్ చేయకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. యాభై శాతం కెపాసిటీతో సినిమా హాళ్లు రన్ చేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని.. కేంద్రం తమ రూల్స్ విషయంలో ఏమైనా మార్పులు తీసుకొస్తే అప్పుడు తెరవాలని చూస్తున్నారు. దసరా నుండి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల సందడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus