Pooja Hegde: తెలుగులో పూజా హెగ్డేకి ఒక్క ఆఫర్ కూడా లేదట..!

పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది వరకు పెద్ద సినిమాల్లో ఆఫర్లు అన్నీ ఆమెకే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా ఆఫర్ కూడా లేదు. ఈ మధ్యనే ఆమె ‘గుంటూరు కారం’ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలియజేసింది. అందుకు కారణం ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం అంటూ వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.

2 వారాల పాటు జరిగిన ఓ షెడ్యూల్ లో (Pooja Hegde) పూజా హెగ్డే పాల్గొంది. అయినా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం ఏంటనేది అర్ధంకాని పరిస్థితి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత పూజ చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. అందువల్లే ఆమెను ‘గుంటూరు కారం’ నుండి మహేష్ బాబు తప్పించినట్టు అంతా చెప్పుకుంటున్నారు. అసలు కారణం ఏంటో ఎవ్వరికీ తెలీదు. కాని మహేష్ పై మాత్రం పూజా హెగ్డే చాలా కోపంగా ఉంది అనేది ఇన్సైడ్ టాక్.

వాస్తవానికి ఆమె పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ప్రాజెక్టులో కూడా హీరోయిన్ గా చేయాలి. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు నుండి కూడా ఆమె తప్పుకుంది. దీంతో ప్రస్తుతానికి తెలుగులో ఆమెకు ఒక్క ఆఫర్ కూడా లేకపోయింది. విజయ్ దేవరకొండతో చేయాల్సిన ‘జన గణ మన’ కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్లో మాత్రం ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. బహుశా అందుకే పూజా హెగ్డే కూడా టాలీవుడ్ ను లైట్ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus