బాలయ్య ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడట

బోయపాటి సినిమాతో బాలకృష్ణ భారీ ప్రయోగానికి తెరలేపాడు. ఎప్పుడూ కత్తులు పట్టే బాలయ్య ఈ సారి కమండలం పట్టనున్నాడు. ప్రత్యర్థుల రక్తంతో తడిసిపోయే బాలయ్య బూడిద, విబూధితో మునిగిపోనున్నాడు. ఇదంతా బాలయ్య అఘోర పాత్ర కోసం చేయనున్నాడు. గతంలో బాలయ్యను రిచ్ గా, హుందాతో కూడిన పాత్రలలో చూపించే బోయపాటి అనూహ్యంగా అఘోరాగా మార్చనున్నాడు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుండి ఆయన అఘోరాగా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. సగటు సినీ అభిమానులతో పాటు, బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇది ఒట్టి పుకారేనని కొట్టి పారేశారు.

ఎప్పుడైతే దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారో అందరూ షాక్ కి గురయ్యారు. ఎప్పటిలాగే బాలయ్యను బోయపాటి రెండు గెటప్స్ లో ప్రజెంట్ చేయనున్నాడు. వాటిలో ఓ పాత్రలో ఆయన అఘోరా వేషం కడతారు. ఐతే మరి ఆయన అఘోరాగా మారడానికి గల నేపధ్యాన్ని చాలా కన్విన్సింగ్ గా చెబుతున్నాం అని బోయపాటి తెలిపారు. మరో వైపు ఈ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేయనున్నాడట.

దాని కోసం ఆయన పెద్ద కసరత్తే మొదలుపెట్టారట. ఈ అఘోరా జీవితాలకు సంబంధించిన బుక్స్ ఆయన చదువుతున్నారట. అలాగే వారి వీడియోలు చూస్తూ బాడీ లాంగ్వేజ్ అధ్యయనం చేస్తున్నాడట. ఆ పాత్రను తెరపై ఓ రేంజ్ లో బాలయ్య రక్తికట్టించనున్నాడని సమాచారం. మరి ఓ పాత్ర కోసం బాలయ్య కమిట్మెంట్ అదుర్స్ కదూ.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus