తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న హీరో మహేష్ బాబు. థమ్స్ అప్, అభి బస్, సంతూర్ సోప్, పారగాన్, మహీంద్రా , టాటా స్కై, ఐడియా సెల్యూలర్, చెన్నై సిల్క్స్, సాయి సూర్య డెవలపర్స్… తదితర అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ప్రోటినేక్స్ అనే ప్రోటీన్ బ్రాండ్ కి అంబాసడర్ గా సైన్ చేశారు. అతను నటించిన భరత్ అనే నేను మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రముఖ కంపెనీలు మహేష్ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన మరొక ప్రముఖ బ్రాండ్ కు చేరింది. ప్రముఖ టూత్ పేస్ట్ “క్లోజప్” ఆయనను ప్రచారకర్తగా నియమించుకుంది.
ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా నిన్ననే కంప్లీట్ చేశారు. త్వరలోనే ఈ యాడ్ టీవీలో రానుంది. దీంతో కలిసి మహేష్ బాబు ఇప్పటివరకు 29వ బ్రాండ్లకు ప్రచారకర్త గా వ్యవహరించారు. తెలుగు హీరోల్లో ఇన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన వారు లేరు. ఈ రికార్డ్ మహేష్ పేరిట మాత్రమే నమోదైంది. అలాగే ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకున్న హీరోల జాబితాలోనూ మహేష్ నంబర్ వన్ గా నిలిచారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు తర్వాత ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న హీరో అల్లు అర్జున్. కోల్ గేట్, రెడ్ బస్, ఓఎల్ఎక్స్, లాట్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, మ్యాంగో ఫ్రూటీ లాంటి అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.