స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి1, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయాలను సొంతం చేసుకున్నారు. తను అనుకున్న సన్నివేశాన్ని అనుకున్న విధంగా వచ్చే వరకు రాజీ పడని రాజమౌళి ప్రతి సీన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. బాహుబలి, బాహుబలి2 సినిమాల తర్వాత ఆ జానర్ లో వేర్వేరు భాషల్లో పలు సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.
మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కినా తమిళం మినహా ఇతర భాషల్లో ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు ఏర్పడలేదనే సంగతి తెలిసిందే. మరోవైపు సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించి మెప్పించే విషయంలో చాలామంది దర్శకులు ఫెయిల్ అవుతున్నారు. తక్కువ ఖర్చుతో ఊహించని స్థాయిలో సినిమాకు ప్రమోషన్స్ నిర్వహించే విషయంలో జక్కన్నకు పోటీనిచ్చే దర్శకుడు లేడనే చెప్పాలి. సౌత్ ఇండియాలో ఎంతోమంది గొప్ప దర్శకులు ఉన్నా కొన్ని విషయాల్లో రాజమౌళి ప్రత్యేకం అని చెప్పాలి.
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూట్ ఆలస్యమైనా ఆ ఎదురుచూపులకు తగ్గ ఫలితం అయితే కచ్చితంగా ఉంటుంది. రాజమౌళి తన సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా నిర్మాతలకు లాభాలు వస్తున్నాయి. చాలామంది డైరెక్టర్లు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు. రాజమౌళిని చాలా విషయాలలో మ్యాచ్ చేసే దర్శకులు అయితే లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాజమౌళి సినిమాలకు దక్కిన స్థాయిలో చాలా సినిమాలకు ప్రశంసలు సైతం దక్కడం లేదు. సినిమాలకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్న రాజమౌళి తన సినిమాల ద్వారా ఎంతోమంది ప్రొడ్యూసర్లకు స్టార్ ప్రొడ్యూసర్లుగా గుర్తింపు వచ్చేలా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో నిర్మాత దానయ్యకు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభంగా దక్కిందని తెలుస్తోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!