సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ అందులో డౌటే లేదు. ఈ సీజన్లో ఆ హీరో సినిమా, ఈ హీరో సినిమా అనే తేడా అనే ఫీలింగ్ లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులు చూస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆ మూడు, నాలుగు రోజులు పండగలా ఉంటుంది. అయితే సంక్రాంతికి ఎక్కడ చూసినా ఎక్కువగా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లోని పాటలు వినిపిస్తూ ఉంటాయి.
కానీ ఈసారి అలాంటి సందర్భాలు కనిపించడం లేదు. ఎందుకంటే 2024 సంక్రాంతికి వచ్చే సినిమాల్లోని పాటలు ఒక్కటి కూడా చార్ట్ బస్టర్స్ అయ్యింది లేదు. ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి సినిమాల్లోని పాటలు ఒక్కటి కూడా చార్ట్ బస్టర్ అయ్యింది లేదు. ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి ‘దమ్ మసాలా’ పాటకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ చార్ట్ బస్టర్ అవ్వలేదు. ‘హనుమాన్’ లో ‘ఆవకాయ పాట’ కొంతలో కొంత పర్వాలేదు అనిపించింది.
అది కూడా చార్ట్ బస్టర్ అవ్వలేదు. (Saindhav) ‘సైంధవ్’ లో ‘రాంగ్ యూసేజ్’ , ‘నా సామి రంగ’ లో ‘ఎత్తుకెళ్లి పోతా పిల్ల’ వంటి పాటల పరిస్థితి కూడా అంతే..! 2023 లో ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ ‘వారసుడు’ వంటి సినిమాలు వచ్చాయి. వాటిలో కనీసం ‘బాస్ పార్టీ’ ‘జై బాలయ్య’ ‘రంజితమే’ వంటి పాటలు ఆకట్టుకున్నాయి. కానీ 2024 సంక్రాంతి సినిమాలు మాత్రం మ్యూజికల్ గా ఫెయిల్యూర్ అనే చెప్పాలి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!