ఈ రోజుల్లో ఏ సినిమాకైనా ప్రచారమే కీలకం. ఎంతమంచి సినిమా తీశామన్నది జనానికి చెప్పుకోవాల్సిందే. ఇందులో చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా ఏం లేదు. చిన్న సినిమా అయితే ఇంకాస్త ఎక్కువగా ప్రచారం చేసుకోవాలి. లేదంటే ..ఆడియన్స్‌పట్టించుకోవడం లేదు. అందుకే…ప్రతీ సినిమా విడుదలకు ముందు ప్రచారంతో హోరెత్తించుకొంటున్నాయి . అయితే నాయకి తీరు ఇందుకు భిన్నంగా తోస్తోంది.
త్రిష కథానాయికగా నటించిన చిత్రమిది. ఒక విధంగా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఈ సినిమాపై ఎవ్వరికీ అంచనాల్లేవు. పైగా గోవి ఓ ఫ్లాప్ దర్శకుడు. కాబట్టి.. ఈ సినిమా ఏమాత్రం సందడి లేకుండా తయారైంది. దానికి తోడు ప్రమోషన్లూ లేవు. మరో మూడ్రోజుల్లో సినిమా బయటకు రాబోతోంది. నాయకి త్రిష ఇంకా బరిలోకి దిగనే లేదు. ఇటు తెలుగులోనే అనుకొంటే.. అటు తమిళంలోనూ ఇదే పరిస్థితి. నిర్మాత గిరిధర్‌తో త్రిషకు ఏమైనా కమ్యునికేషన్ గ్యాప్పా?? అంటే అదీ లేదు. గిరిధర్ త్రిషకి బాగా కావాల్సిన వ్యక్తి. మరెందుకని త్రిష ఈ సినిమాని లైట్ తీసుకొందో అర్థం కావడం లేదు.