తమిళనాట రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న కథానాయకుడు విజయ్. అందుకే రజనీకాంత్ ను తలైవా అని పిలుచుకొనే తమిళ జనాలు విజయ్ ను తలపతి అంటుంటారు. సినిమాల రిలీజ్ విషయంలోనూ ఆదేస్థాయిలో పోటీపడుతుంటారు ఈ స్టార్లు. అయితే.. రజనీకాంత్ సినిమాలు తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, చైనీ భాషల్లో విడుదలౌతుంటాయి. అందుకే రజనీకాంత్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలుగు & హిందీ రిలీజ్ ప్రమోషన్స్ విషయంలోనూ పాల్గొంటుంటారు. అందుకే రిజల్ట్ తో సంబంధం లేకుండా రజనీకాంత్ సినిమాల కోసం డిస్ట్రిబ్యూటర్స్ కాస్త గట్టిగానే పోటీపడుతుంటారు. కానీ.. విజయ్ మాత్రం తన సినిమాను తమిళనాట మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ మిగతా చోట్ల మాత్రం ఒదిలేస్తున్నాడు.
విజయ్ రీసెంట్ సినిమా “మెర్సల్” తమిళంలో దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదలయ్యింది. ఆదేరోజున తెలుగులోనూ “అదిరింది”గా రిలీజ్ చేయాలనుకొన్నప్పటికీ సెన్సార్ ఇష్యూస్ కారణంగా వారం లేటుగా అనగా అక్టోబర్ 27న విడుదలవుతోంది. తెలుగులో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నుండి శరత్ మరార్ విడుదలచేస్తున్న “అదిరింది” ప్రమోషన్స్ విషయంలో విజయ్ ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అందువల్ల తెలుగులో సినిమాకి కనీస స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. పైగా.. తమిళంలోనూ యావరేజ్ టాక్ తెచ్చుకొన్న ఈ చిత్రం తెలుగులో ఎస్థాయి విజయం సాధిస్తుందో చెప్పలేం.