“28 సంవత్సరాల క్రితం శివ సినిమా నన్ను ఛేంజ్ చేసింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నా..” అంటూ నాగార్జున వర్మతో చేస్తున్న సినిమా గురించి ట్వీట్ చేశారు. నాగ్ తో పాటు ఆయన అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ కూడా ఉంటుంది.. అయితే ఆమెతో నాగార్జున ప్రేమ ఉండదు. ఆమె క్యారక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని సమాచారం. హీరోయిన్ గా అనుష్క పేరుని పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
రెండో షెడ్యూల్ మొదలైనప్పుడు హీరోయిన్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అసలు సాంగ్స్ ఉండవని చెప్పుకుంటున్నారు. ఇది కొంత నిరాశపరిచే విధంగా ఉన్నప్పటికీ.. మరో కోణంలో ఆలోచిస్తే.. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని అర్ధం అవుతోంది. శివ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మార్పులకు కారణమయినట్టు.. ఈ మూవీ కూడా మరికొన్ని మార్పులకు నాంది పలకడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలచేయడానికి వర్మ టీమ్ ప్లాన్ చేస్తుంది. అత్యంత వేగంగా సినిమా చేయగల వర్మ.. ఈ చిత్రాన్ని థియేటర్లోకి ఎప్పుడు తీసుకొస్తాడో చూడాలి.