శంకర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్!

  • February 1, 2021 / 07:52 AM IST

పాన్ ఇండియా సినిమాల బిజినెస్ కు ఒక సరికొత్త రూట్ క్రియేట్ చేసిన దర్శకుడు శంకర్. ఎలాంటి సినిమాలు చేసినా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి సందేశం కూడా ఇవ్వడం ఆయనకు అలవాటు. రోబో సినిమాతో శంకర్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఆ సినిమా వలన శంకర్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం హాట్ టాపిక్ గా మారింది.

శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీ రోబో సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ కథను ఒక నవల ఆధారంగా కాపీ కొట్టినట్లు అప్పట్లో అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. అరూర్‌ తమిళ్‌నాడన్‌ అనే రచయిత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విషయం సీరియస్ గా మారింది. చాలా సార్లు ఈ విషయంలో కోర్టు శంకర్ నుంచి వివరణ కోరగా ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు.

ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ రెండో కోర్టు ఫైనల్ గా శంకర్ కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. తాను రాసిన ‘జిగుబా’ కథను కాపీ చేసి ‘ఎంథిరన్’‌గా తీశారంటూ తనకు న్యాయం జరగాలంటూ కొన్నేళ్ల క్రితం అరూర్ కేసు నమోదు చేశాడు. అయితే ఎన్ని ఏళ్ళు గడిచినా శంకర్ తనకేమీ పట్టనట్లే ఉండడంతో విషయం కాస్త సీరియస్ గా మారినట్లు సమాచారం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus