చిక్కుల్లో పడ్డ రజినీకాంత్ హీరోయిన్.. ఏమైందంటే..!

బాలీవుడ్ హీరోయిన్ పై చీటింగ్ కేసు నమోదవ్వడం చర్చనీయాంశంగా మారింది.విషయంలోకి వెళితే… సెప్టెంబర్ 30, 2018న జరిగిన ఈవెంట్‌కు సోనాక్షి హాజరు కావాల్సి ఉంది.ఇందుకు గాను సోనాక్షి సిన్హా టీమ్ మెంబర్స్ అయినటువంటి మాళవిక పంజాబీ, ధుమిల్ థక్కర్, ఎడ్గార్ సకారియా, అభిషేక్ సిన్హా వారికి ఈవెంట్ నిర్వాహకుడు అయిన ప్రమోద్ శర్మ పేమెంట్ చేయడం కూడా జరిగింది. కానీ సోనాక్షి ఆ వేడుకకు హాజరు కాలేదు. దీంతో ఆ ఈవెంట్ నిర్వాహకులకు నష్టాలు వచ్చాయి. పోనీ ఈవెంట్ కి సోనాక్షి వెళ్ళలేదు కాబట్టి.. ఆమె టీం తిరిగి ఈవెంట్ నిర్వాహకులకు డబ్బు చెల్లించింది కూడా లేదు.

అందుకే ఆ ఈవెంట్ నిర్వాహకులు 2019 ఫిబ్రవరి మురాదాబాద్ కోర్టులో కేసు వేశారు. అయితే ఆ కేసును వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది సోనాక్షి సిన్హా. దీంతో ఆమె పై జరుగుతున్నా ఆపరేషన్, విచారణకి స్టే విధించి ఆమె టీమ్ పై మాత్రం విచారణ సాగించారు. మరోపక్క సోనాక్షి టీమ్ పై ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యు అయ్యింది. ఫిబ్రవరి 28న తదుపరి విచారణ జరగనుంది.

ప్రస్తుతం సోనాక్షి సిన్హా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్..ల ‘బడే మియా చోటే మియా’ , ‘నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ చిత్రాలతో బిజీగా ఉంది.అలాగే ఓ వెబ్ సిరీస్..లో కూడా నటిస్తుంది. ‘లింగ’ సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus