ఆ మధ్య అవసరాల శ్రీనివాస్ ఓ వైరల్ వీడియో చేశాడు గుర్తుందా. తన అసిస్టెంట్ ఒకరు కోపంగా వచ్చి… అవసరాల విగ్ లాగేస్తాడు. దాంతో అతను ఆగ్రహోదక్తుడు అవుతాడు. ఇదంతా చూసి కొందరు ఆశ్చర్యపోతే… ఇది సినిమా ప్రమోషనే అని ఇంకొందరు ఈజీగా తేల్చేశారు. అంతేకాదు ఆ సినిమా బాలీవుడ్ ‘బాలా’ రీమేక్ అని కూడా చెప్పేశారు. కొన్నాళ్లు ఈ విషయం మీద స్పందించని టీమ్… ఇప్పుడు అదే పనిగా చెబుతూ వస్తోంది. ఈ సినిమా హీరో అవసరాల శ్రీనివాస్ ఇంకేం చెప్పారంటే…
సమాజంలో బాడీ షేమింగ్ ఎప్పటి నుంచో ఉందన్న అవసరాల… అది ఎంతోమంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని చెప్పుకొచ్చారు. అందుకే ఇలాంటి అంశంపై ఓ కథ చెప్పాలని ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా చేశామని చెప్పారు. ఈ కథ రాసుకుంటున్నప్పుడు సినిమాకు ‘అందమే ఆనందం’ అనే టైటిల్ అనుకున్నారట. కానీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అన్న పేరు క్రిష్‌కి బాగా నచ్చి ఓకే చేశారట. ఇదంతా చూస్తుంటే… ఈ సినిమా ‘బాలా’కు రీమేక్ కాదు అని చెప్పడానికి…
చిత్రబృందం చాలా ప్రయత్నాలు చేస్తోంది అనిపిస్తోంది. గతంలో కూడా ఈ సినిమా ‘బాలా’కు ముందే రాసుకున్నామని, అయితే వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమైందని చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ సినిమా ‘బాలా’ను చూసి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్న కథే అనే చర్చ కొనసాగుతూనే ఉంది. సినిమా వచ్చాక కానీ… దీనిపై క్లారిటీ రాదు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!