స్టార్‌ హీరోయిన్‌ కారును గుద్దేసిన డ్రంకెన్‌ డ్రైవర్‌.. ఏమైందంటే?

ప్రముఖ బాలీవుడ్‌ నటి, తెలుగు వారికి కూడా పరిచయం ఉన్న నోరా ఫతేహి కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. ఇంకేముంది కొంతమంది ఆమెకు ఏమైందా అని బాధపడుతుండగా, ఇంకొందరు ఎవరి వల్ల యాక్సిడెంట్ అయింది అని ఆరాలు తీయడం మొదలెట్టారు. ఇక ఆ మిగిలిన కొందరు ఉంటారుగా లేనిపోని రూమర్లు తీసుకురావడానికి. అలాంటి అవకాశం ఇవ్వకుండా, ఒకవేళ ఎవరైనా స్టార్ట్‌ చేసి ఉంటే ఆపేయడానికి ఆమె ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తాను క్షేమంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చేసింది.

Nora Fatehi

రోడ్డు ప్రమాదానికి గురైన తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని చెప్పిన నోరా.. డ్రింక్‌ చేసిన ఓ కారు డ్రైవర్‌ తన వాహనాన్ని ఢీ కొట్టాడని క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనలో తన తల కారు విండోకు బలంగా తాకిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి బాగానే ఉన్నానని, కంకషన్‌, వాపు లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది. అయితే ఇంకా గాయాలు మానలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతోపాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను ప్రోత్సహించొద్దని నోరా రిక్వెస్ట్‌ ఏసింది.

ముంబయిలో జరుగుతున్న ‘సన్‌బర్న్‌’ ఫెస్టివల్‌కు నోరా వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం ముంబయి పశ్చిమ అంబోలీ లింక్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ రోజు ఆమె కాసేపు విశ్రాంతి తీసుకొని ఈవెంట్‌కు హాజరవడం గమనార్హం. ఇక ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కారు నడిపే సమయంలో డ్రైవర్‌ వినయ్‌ సకాల్ప్‌ మద్యం మత్తులో ఉన్నాడని స్పష్టత ఇచ్చారు. అతనిపై రాష్ డ్రైవింగ్, డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు.

డబ్బులు కోసమే ఆ సినిమాల్లో నటించా.. రాధిక ఆప్టే వైరల్‌ వ్యాఖ్యలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus