Keerthy Suresh: కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ.. గ్లామర్ కష్టం ఫలించిందా?

తెలుగు, తమిళ సినిమాల్లో తన అద్భుత నటనతో మంచి గుర్తింపు పొందిన కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇటీవల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దసరా వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత కీర్తి సురేష్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావించి, బేబి జాన్ (Baby John) చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ప్రత్యేకమైన మూవీగా మారుతుందని భావించినప్పటికీ, బాక్సాఫీస్ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయికి చేరలేదు. కీర్తి ఈ చిత్రంలో తన పాత్ర కోసం గ్లామర్‌ విషయంలో కూడా రెండు అడుగులు ముందుకేసి కొత్తగా కనిపించింది.

Keerthy Suresh

ఇప్పటి వరకు తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఎక్కువగా సంప్రదాయభారిత పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని గ్లామర్ సీన్స్ లో ఎక్కువగా కనిపించింది. అయితే బేబీ జాన్ లో కీర్తి పాత్రకు తగినంత స్కోప్ లేకపోవడంతో ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. అయితే, సినిమా విడుదలకు ముందు కీర్తి ఈ చిత్రానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రొమోషన్‌లలో పాల్గొని తన గ్లామర్ మేకోవర్‌పై దృష్టి పెట్టింది.

ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోయింది. కీర్తి తన నటనలోని కొత్త కోణాలను చూపించాలన్న ప్రయత్నం కొంతమేరకు సఫలం అయినప్పటికీ, కథనానికి సంబంధించిన పరిమితుల వల్ల ఆమె పాత్ర ప్రభావం తగ్గిపోయింది. కీర్తి బాలీవుడ్ ప్రవేశం గురించి మొదట్లోనే పలు ప్రశ్నలు తలెత్తినా, ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు, తెలుగు పరిశ్రమలో కూడా ఆమెపై ఆశలు ఎక్కువే ఉన్నాయి. కీర్తి బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో విజయాన్ని సాధించకపోయినప్పటికీ, దక్షిణాది పరిశ్రమలో తన సత్తాను మరింత మెరుగుపరచుకునే ప్రయత్నాల్లో ఉంది.

మొదటి వారం ఓకే అనిపించిన ‘UI’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus