పెద్ద సినిమాలు లేకపోతే థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి హిట్ టాక్ వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకవేళ చిన్న సినిమా హిట్ అయినా.. దాని వెనుక పెద్ద నిర్మాత హస్తం ఉంటేనే నిలబడుతుంది. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల విషయానికి వస్తే… ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) వెనుక ‘మైత్రి’ వారు ఉన్నారు. ‘కమిటీ కుర్రాళ్ళు’ (Committee Kurrollu) ‘క’ (KA) సినిమాల వెనుక ‘గీతా ఆర్ట్స్’ కి చెందిన వంశీ నందిపాటి హస్తం ఉంది.
‘ఆయ్’ (AAY) గీతా ఆర్ట్స్ నుండి వచ్చిన సినిమా. ’35 – చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) కి రానా సపోర్ట్ ఉంది. ఇలా చిన్న సినిమాల వెనుక పెద్ద వాళ్ళు ఉంటే థియేటర్లలో నిలబడుతున్నాయి. లేదు అంటే ఓటీటీలు ముందుకొచ్చి వాటిని సేవ్ చేస్తున్నాయి. అందుకే సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు క్లోజ్ అవుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. 2024 లో చూసుకుంటే కేవలం మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) , ప్రభాస్ ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) , ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) , అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) వంటి 4 పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి.
ఈ రకంగా చూసుకుంటే.. 2025లో ఎన్టీఆర్ , మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలు వచ్చే అవకాశాలు లేవు. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా ఏప్రిల్ లో వస్తుంది. అదే టైంలో చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) వంటివి కూడా అదే టైంలో రావచ్చు. 2025 ఫస్ట్ హాఫ్ లోనే పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ అయిపోతాయి. సెకండాఫ్ మరింత దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.