బిగ్ బాస్ షోలో శనివారం ఎపిసోడ్ నాగార్జున హౌస్ మేట్స్ ని ఒక ఆట ఆడుకున్నారు. లాస్ట్ వీక్ వాళ్లు చేసిన మిస్టేక్స్ ఇంకా వాళ్లు గేమ్ ఆడిన పద్దతిని ఎండగట్టారు. ముఖ్యంగా బాలాదిత్య స్మోకింగ్ గురించి వచ్చిన ఇష్యూని పరిష్కరించారు. బాలాదిత్య గీతుని కేవలం సిగరెట్స్ కోసం అన్ని మాటలు అనడం కరెక్ట్ కాదని చెప్పారు. ఇక్కడ గీతు కావాలనే వాంటెడ్ గా టార్గెట్ చేసి బాలాదిత్య వీక్ పాయింట్ పైన కొట్టింది. ఇది గాలికి వదిలేసి బాలాదిత్యకి క్లాస్ పీకారు. దీంతో సిగరెట్స్ కోసం బాలాదిత్య గొడవ గొడవ చేశాడనే ముద్ర నాకు వద్దని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకూ స్మోక్ చేయకూడదని నిర్ణయించుకున్నానంటూ చెప్పాడు బాలాదిత్య.
దీంతో హౌస్ మేట్స్ తో పాటుగా, హోస్ట్ నాగార్జున కూడా ప్రశంసించాడు. మరోవైపు గీతుకి కూడా టాస్క్ అయిపోయినా కూడా కావాలని లైటర్ దాయడం తప్పని, అలాగే ఎదుటివారి వీక్ నెస్ తో గేమ్ ఆడటం గీతు పద్దతిని క్లియర్ గా ఎక్స్ ప్లయిన్ చేశారు. ఇక శ్రీహాన్ – శ్రీసత్య ఇద్దరి గురించి ఇనయ మాట్లాడిన మాటల గురించి అడిగారు. ఇక్కడ ఇనయ కవర్ డ్రైవ్ చేస్తుంటే, క్లాస్ పీకారు. అనాల్సింది అనేశావ్ అని, అన్న తర్వాత దానికి వేరే రీజన్స్ చెప్పొద్దని క్లియర్ గా చెప్పాడు. దీంతో ఇనయ శ్రీసత్యకి సారీ చెప్పింది. ఇక కెప్టెన్ గా శ్రీహాన్ కి పనిష్మెంట్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున.
గతవారం గీతు చేపల టాస్క్ లో చేసిన పనికి పనిష్మెంట్ గా వాష్ రూమ్స్ క్లీన్ చేయమని చెప్పారు. దీనిని కెప్టెన్ శ్రీహాన్ దగ్గరుండీ మరీ చేయించాలని చెప్పారు. కానీ, గీతు పనిష్మెంట్ చేయడంలో విఫలం అయ్యింది. అంతేకాదు, ఆదిరెడ్డి సపోర్ట్ తీస్కుని వాష్ రూమ్స్ క్లీన్ చేసింది. దీన్ని శ్రీహాన్ చూసి కూడా ఏమీ అనలేదు. అందుకే, ఇప్పుడు శ్రీహాన్ కి శిక్ష విధించారు. వచ్చేవారం కెప్టెన్సీ కంటెండర్ కాలేవని ఆ అవకాశం లేకుండా కట్ చేశామని చెప్పడంతో హౌస్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. గీతు చేసిన తప్పుకి శ్రీహాన్ పనిష్మంట్ తీస్కోవాల్సి వచ్చింది.
బ్లూటీమ్ లో ఉన్న ఆదిరెడ్డి వాళ్ల టీమ్ కి ర్యాకింగ్స్ ఇచ్చాడు. నెంబర్ వన్ ర్యాంక్ ని రాజ్ కి ఇచ్చాడు. అలాగే, ఇనయకి సెకండ్ ర్యాంక్ ఇచ్చాడు. మూడో ర్యాంక్ బోర్డ్ మెరీనా, నాలుగు వాసంతీ, ఐదు బాలాదిత్య, ఆరు రోహిత్, ఏడు తనకి తానే ర్యాంక్ బోర్డ్ వేసుకున్నాడు. అలాగే, గీతు కూడా తన రెడ్ టీమ్ సభ్యులకి ర్యాంక్స్ ఇచ్చింది. ఫస్ట్ ర్యాంక్ శ్రీహాన్ కి, సెకండ్ ర్యాంక్ ఫైమాకి, మూడో ర్యాంక్ శ్రీసత్య, నాలుగు రేవంత్, ఐదో ర్యాంక్ తనకి తానే వేస్కుంది. ఆరో ర్యాంక్ కీర్తికి ఇచ్చింది. ఇక్కడ టాస్క్ ఆడేటపుడు దెయ్యంగా మారింది ఫస్ట్ ఫైమానే. అయినా కూడా ఫైమాకి సెకండ్ ర్యాంక్ ఇచ్చింది గీతు.
తర్వాత నాగార్జున రేవంత్ కి గట్టి క్లాస్ పీకారు. గేమ్ ఆడేటపుడు లాస్ట్ వీక్ ఉన్మాదిలా ఆడుతున్నావని చెప్పినా కూడా అలాగే గేమ్ ఆడుతున్నావ్ అంటూ ఎల్లో కార్డ్ ఇచ్చాడు. ఇక హౌస్ లో ఫుడ్ సమస్యని తీర్చి ముగ్గుర్ని సేవ్ చేశారు. ఆధివారం గీతు ఎలిమినేషన్ అనేది హైలెట్ కాబోతోంది. మొత్తానికి అదీ మేటర్.