NTR30: తారక్ 30 మూవీ షూటింగ్ ఎప్పుడంటే?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రెండు పాటలు మినహా ఆచార్య మూవీ షూటింగ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆచార్య రిలీజ్ డేట్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆచార్య రిలీజ్ కు ముందే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను పూర్తి చేసి ఫ్రీ అయిన ఎన్టీఆర్ త్వరలో ఎవరు మీలో కోటీశ్వరులు మిగిలిన ఎపిసోడ్ల షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

ఆచార్య సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ నెల నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని కొరటాల శివ భావిస్తున్నట్టు బోగట్టా. ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారని ఈ ఏడాది చివరి నాటికి దాదాపుగా 50 శాతం షూటింగ్ పూర్తయ్యేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుండగా అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని సమాచారం. ఎన్టీఆర్ గత కొన్నేళ్ల నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను మరింత పెంచే విధంగా తర్వాత సినిమాలు ఉండాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus