అల్లు అర్జున్ పాటలోని లిరిక్స్ ని పాడిన ఎన్టీఆర్
- August 16, 2017 / 07:57 AM ISTByFilmy Focus
స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొడుతున్నారు. నటన, డ్యాన్స్, ఫైట్స్ తో సినిమాల్లో అలరించిన తారక్ తొలి సారి బుల్లితెరపై మాటల మత్తు జల్లుతున్నారు. తన యాంకరింగ్ తో చిన్న, పెద్ద తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నారు. షో సంగతులతో పాటు తన ఇష్టాలను గురించి చెబుతున్నారు. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాటంటే ఎంత ఇష్టమో వివరించారు. గత ఆదివారం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ లో సింగర్ కల్పన ఎలిమినేట్ అయింది. ఆమె షో నుంచి బయటికి వెళ్ళిపోతూ సింగింగ్ ట్యాలెంట్ ని బయటపెట్టింది. ఒక పార్టిసిపెంట్స్ గురించి వివరించడానికి ఆర్య 2 సినిమాలోని ” మిస్టర్ పెర్ఫెక్ట్ ” పాటను కొంత పాడి వినిపించింది.
అయితే ఆ పాటంటే తనకు కూడా ఇష్టమని. అందులోని “మ్యాన్ హోల్ లాంటి మైండ్ వీడిదండోయ్..చీటండోయ్..ఛీపండోయ్.. గజిబిజి పజిలండోయ్..” అనే లిరిక్స్ అంటే మరింత ఇష్టమని స్వయంగా పాడి మరీ చెప్పారు. నందమూరి హీరోలు, మెగా హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. అందుకే పబ్లిక్ గా ఒకరి గురించి మరొకరు అభినందించుకోవడం చూడలేం. కానీ ఎన్టీఆర్ ఈగోలన్నీ పక్కన పెట్టి అల్లు అర్జున్ పాట అంటే ఇష్టమని చెప్పి నందమూరి అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















