ఆ విషయంలో ఒకే స్థానంలో ఎన్టీఆర్, అఖిల్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పదిహేడేళ్ల క్రితం సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. చిన్న వయసులోనే బ్లాక్ బస్టర్ హిట్స్  అందుకున్నారు. స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అక్కినేని ప్రిన్స్ అఖిల్ మాత్రం మూడేళ్ళ క్రితం ఇండస్ట్రీ లోకి వచ్చారు. రెండు సినిమాలు మాత్రమే చేశారు. విజయాలు, అనుభవం విషయంలోనూ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఒక విషయంలో మాత్రం సరిసమానమయ్యారు. అదే ట్విట్టర్ ఫాలోవర్స్. సెప్టెంబర్  (2009 ) లో ట్విట్టర్ ఖాతాను తెరిచిన ఎన్టీఆర్ ఇప్పటికి 312 ట్వీట్స్ మాత్రమే చేశారు.

అయినప్పటికీ అతి తక్కువ కాలంలో 2  మిలియన్స్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నారు. మే (2010 )లో అఖిల్ ట్విట్టర్ ఖాతాని తెరిచారు. అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ 6,699 ట్వీట్స్ చేశారు. అతను కూడా ఈరోజే  2 మిలియన్స్ ఫాలోవర్స్ ని కైవశం చేసుకున్నారు. ఒకేసారి ఎన్టీఆర్, అఖిల్ ఈ మైలురాయిని చేరుకోవడాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం కోసం ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. అక్కినేని అఖిల్‌ తన మూడో చిత్రాన్ని ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus