టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనేక సవాళ్లను ఎదుర్కుని మళ్ళీ హిట్ బాట పట్టాడు…ఒకటి కాదు రెండు…కాదు వరుసగా….మూడు హిట్స్ అందుకుని హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. అయితే అదే క్రమంలో జనతా గ్యారేజ్ హిట్ తరువాత ఎలా అయిన హిట్ దర్శకుడితో సినిమా చెయ్యాలి అని ప్లాన్ చేసుకున్న ఎన్టీఆర్…ఆ ప్లాన్ కాస్త బెడిసి కొట్టడంతో డీలా పడ్డాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదే క్రమంలో ఇప్పటివరకు తన రెండో సినిమాను ఇంకా తెలుపని ఎన్టీఆర్ గ్యాప్ పెరిగినా పర్లేదు కానీ.. తొందరపడి ఓకె చెప్పేయడానికి ఎక్కడా రెడీగా లేడు…అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో వినిపిస్తున్న తాజా వివరాల ప్రకారం,ఎన్టీఆర్ తరువాత ప్రాజెక్ట్ అనిల్ రవిపూడితో చేస్తున్నాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.
అయితే.. ఈ దర్శకుడు రామ్ తో హీరోని గుడ్డివాడి పాత్రతో చేద్దామని అనుకుని క్యాన్సిల్ అయిన సబ్జెక్టులో.. కొన్ని కీలకమార్పులు చేసి ఎన్టీఆర్ కి వినిపించాడనే టాక్ వచ్చింది. కానీ.. ఎన్టీఆర్-అనిల్ రావిపూడిలు డిస్కస్ చేసుకున్న సబ్జెక్ట్ వేరే అని తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టెయినర్ గా తీర్చిదిద్దడమే పాయింట్ తప్ప.. హీరో కేరక్టర్ అంధుడి రోల్ కాదని అంటున్నారు. ఇప్పటికైతే ఈ కధపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ….మొత్తానికైతే….ఎన్టీఆర్ తరువాత సినిమా అనిల్ రావిపుడితోనే చేస్తాడు అని మాత్రం టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న వార్త…మరి దీనిపై ఎన్టీఆర్ ఎప్పటికీ కన్ఫర్మేషన్ ఇస్తాడో చూడాలి.