ఎన్టీఆర్, బాలకృష్ణ కలయికలో ఆదిత్య 999!
- November 28, 2016 / 11:30 AM ISTByFilmy Focus
పాతికేళ్ల క్రితం వచ్చిన ఆదిత్య 369 మూవీ సంచలనం సృష్టించింది. ఇందులో నటసింహ నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు తొలి సారి సైన్స్ ఫిక్షన్ కథను తెలుగు వారికీ అర్థమయ్యేలా తీసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని అనుకున్నారు. ఆదిత్య 999 టైటిల్ తో కథ రెడీ చేయడం, అది బాలయ్య నచ్చడం కూడా జరిగిపోయింది. కానీ ఆఖరి క్షణంలో వందో చిత్రంగా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ లోనే బాలకృష్ణ బిజీగా ఉన్నారు.
సింగీతం మాత్రం నిరాశపడకుండా ఆదిత్య 999 కథని రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పారు. తారక్ కి స్టోరీ చాలా బాగా నచ్చిందని సమాచారం. సింగీతంతో సినిమా చేయడానికి ఒకే కూడా చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ విషయం బాబాయికి చెప్పి ఆయన అనుమతి తీసుకున్నాకే నటిస్తానని తారక్ కండిషన్ పెట్టారంట. నిర్మాతలు మాత్రం ఈ కథలో ఇద్దరినీ నటింపజేయించాలని భావిస్తున్నారు. ఇద్దరికీ కథ నచ్చింది. ఇందులో బాబాయ్, అబ్బాయ్ నటించడానికి, వారి ఇమేజ్ కి తగిన పాత్రలున్నాయి. అందుకే ఎలాగైనా బాలకృష్ణని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. వారిద్దరూ కలిస్తే సినిమా మరింత బాగా వస్తుందని డైరక్టర్ సంతోష పడుతున్నారు. మరి అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ కలయికలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందో ? లేదో? కొన్ని రోజుల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















