ఎన్టీఆర్-రాజమౌళి అంత కాకపోయినా ఎన్టీఆర్-వినాయక్ లది హిట్ కాంబినేషనే. ఈ ఇరువురి దర్శకులతో మంచి సాన్నిహిత్యం గల ఎన్టీఆర్ ఇద్దరితోను చెరో మూడు సినిమాలు చేశాడు. రాజమౌళి పెద్ద పెద్ద హిట్లిస్తే.. వినాయక్ తొలి సూపర్ హిట్ ఇచ్చాడు. అందుకే వీరిద్దరంటే యాంగ్ టైగర్ కి అంత గురి. బాహుబలి 2 తర్వాత రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవి తెరమరుగై వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది.
ఎన్టీఆర్-వినాయక్ కలయికలో వచ్చిన చివరి సినిమా ‘అదుర్స్’. కామెడీ యాక్షన్ సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా 2010 సంక్రాంతి పండగకు విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించగా ‘నరసింహా చారి’ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అప్పటినుండి ఈ సినిమాకి రెండో భాగం (సీక్వెల్) చేయాలనీ ఎన్టీఆర్ – వినాయక్ బలంగా ఫిక్స్ అయిపోయారు. అయితే కథ సిద్ధమవద్దూ..! మొత్తానికి ఆరేళ్ళ తర్వాత తన రైటర్స్ టీమ్ తో కలిసి ఈ స్క్రిప్ట్ ని వినాయక్ ఓ కొలిక్కి తీసుకొచ్చారట. ఎన్టీఆర్ తర్వాతి సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు వినవస్తున్న సమయంలో వినాయక్ పేరు వినిపించడం విశేషం. అయితే ‘ఖైదీ’ విడుదలయ్యేవరకు ఆయన బయటికొస్తారో లేదో మరి..!