ఎన్టీఆర్ – వినాయక్.. అర్జెంట్ మీటింగ్
- November 19, 2016 / 05:48 AM ISTByFilmy Focus
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకులు, కథల అన్వేషణలో ఉన్నాడు. తొందరగా సినిమా మొదలెట్టేయాలన్న ఆలోచన లేకపోయినా.. ఓ కథ ఫిక్స్ చేసుకొని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తే తన సినిమాపై పెరుగుతున్న రకరకాల ఊగాహానాలు, గందరగోళాలకు చెక్ పెట్టొచ్చని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.
ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ వి.వి.వినాయక్. ఎందుకంటే స్టార్ హీరోలంతా చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నారు. వినాయక్ మాత్రం జనవరిలో ఖాళీ అయిపోతాడు. ఆ తరవాత తనకేం కమిట్‌మెంట్స్ లేవు. పైగా ఎన్టీఆర్ – వినాయక్‌ల మధ్య రాపో చాలా బాగుంటుంది.
















