పోలీస్ గెటప్ లో ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

“నాడు, నేడు మనదేశంతోనే చరిత్రకి శ్రీకారం..” అంటూ తెలుగువారి అశీసులు కోరుతూ మనదేశంలో ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలకృష్ణ లుక్ ని నేడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఆ లుక్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ బయటికి వెళ్ళిన తర్వాత బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి ని అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్ ని ఎంచుకొని మంచి పని చేశారని ఫస్ట్ లుక్ చూసి అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు. మనదేశం సినిమాతోనే నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలయింది. అందుకే అదే గెటప్ తోనే తొలిషాట్ ని తెరకెక్కించారు క్రిష్. ఆ సినిమా డైరక్టర్ ఎల్వి ప్రసాద్ గా బెంగాలీ నటుడు జిషు సేన్ నటించారు.

వీరిద్దరి మధ్య సన్నివేశాన్ని ఈరోజు చిత్రీకరించారు. తొలి షెడ్యూల్లో మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో నటించడానికి విద్యాబాలన్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఆమె కూడా త్వరలో షూట్ లో జాయిన్ కానుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ బయోపిక్ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus